Share News

విద్యుత భారం తగదు

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:13 AM

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత భారం మోపడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.

విద్యుత భారం తగదు
ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

విద్యుత భవన ఎదుట సీపీఎం ధర్నా

కల్లూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యుత భారం మోపడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలపై వేస్తున్న ట్రూఅప్‌, సర్దు బాటు చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్‌ మీటర్లను నియంత్రించాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యుత భవన ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన ఆదానీతో చేసుకున్న 17వేల కోట్ల సెకీ ఒప్పంద అవి నీతి బాగోతం బట్టబయలైందన్నారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తుందంటే టీడీపీ ప్రభుత్వ భాగ స్వామ్యమెంత అని ఎద్దేవా చేశారు. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో రూ.500 నుంచి రూ.1000 అదనపు బిల్లులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌, జిల్లా కార్యదర్శిదర్శి వర్గ సభ్యుడు టి.రాముడు, నాయ కులు పీఎస్‌ రాధాకృష్ణ, ఎండీ ఆనంద్‌, ఎం.రాజశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు అరుణ, గురుశేఖర్‌, సాయిబాబా పాల్గొన్నారు.

ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేయాలి: సీపీఎం

ఓర్వకల్లు: ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి నాగన్న డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఓర్వకల్లులోని విద్యుత సబ్‌ స్టేషన ఎదుట ధర్నా చేశారు. అనంతరం విద్యుత ఏఈ సునీల్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాగన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ట్రూ అప్‌ చార్జీల పేరుతో ప్రజలపై రూ.32వేల కోట్లకుపైగా భారం వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన, నాగరాజు, శ్రీరాములు, వెంకటేశ్వర్లు, హుశేన, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 01:13 AM