ఘనంగా రంజాన్
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:29 AM
ఆత్మకూరు పట్టణంలో సోమవారం రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు మసీదులు, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు.

ఆత్మకూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు పట్టణంలో సోమవారం రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు మసీదులు, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. ఆయా మసీదుల్లో మతపెద్దలు రంజాన్ సందేశాన్ని జనులకు వినిపించి అందులోని మంచి విషయాలకు వెల్లడించారు. పట్టణంలోని నంద్యాల టర్నింగ్‌లో సీపీఎం తరుపున ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బుడ్డా
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక నంద్యాల టర్నింగ్ వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి ముస్లింలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు పెద్దఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే బుడ్డాకు ఆత్మీయంగా పలుకరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ మోమిన్ షబాన, మున్సిపల్ మాజీ చైర్మన్ శివపురం నూర్‌మహ్మద్, కోఆప్షన్ సభ్యుడు ఎంఏ రషీద్ ఎమ్మెల్యే బుడ్డాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్, నాయకులు యుగంధర్ రెడ్డి, కలీముల్లా, అబ్దుల్లాపురం బాషా, నబీరసూల్, మోహబతుల్లా, షాబుద్దీన్, వెన్నా శ్రీధర్‌రెడ్డి, రామ్మూర్తి, నాగూర్ తదితరులు ఉన్నారు.
ఆత్మకూరు రూరల్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మండలంలోని ఆయా గ్రామాలలోని మసీదులలో, ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
వెలుగోడు: మండలంలో రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి ఒక్కరూకలసి మెలసి ఉండాలని, చెడు వ్యసనాలను వదిలి సన్మార్గంలో నడవాలని మత పెద్దలు పిలుపునిచ్చారు.
బండిఆత్మకూరు: మండలంలోని పలు గ్రామాల్లో ముస్లీంలు రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ముస్లిలు పేదలకు దాన ధర్మాలు చేశారు.
నందికొట్కూరు: పట్టణలోని ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. కార్యక్రమాల్లో రబ్బాని గ్రూప్ అధినేత ముస్లిం మైనార్టీ సీనియర్ నేత ఆల్-హాజ్-హాజీ మహబూబ్ సాహెబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని, కౌన్సిలర్ జాకీర్, అబ్దుల్ సూకూర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ రంజాన్ అంటే ప్రేమ, మానవత్వం, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, జాకీర్, ముర్తుజావళి, జమీల్, తదితరులు పాల్గొన్నారు.
పగిడ్యాల: మండలంలో రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఈద్గాల వద్ద ముస్లింలు నమాజ్ చేశారు. ఇమాంములు రంజన్ ప్రాముఖ్యతను వివరించారు. నెహ్రూనగర్ గ్రామంలో ముస్లింలు నమాజ్ చేసుకునేం దుకు ఈద్గా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సివస్తుందని ముస్లీం పెద్దలు ఫరూక్, షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ సందర్బంగా నమాజ్ చేసుకునేందుకు ఈద్గా లేకపోవడంతో సమీపం లోని పంట పొలాల్లో నమాజ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.
కొత్తపల్లి: దుద్యాల, శివపురం, ముసలిమడుగు, కొత్తపల్లి, నందికుంట, కొక్కెరంచ ఎదురుపాడు తదితర గ్రామాల్లో ముస్లీంలు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. మసీదులు, ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పాములపాడు: మండలంలోని అన్ని గ్రామాలలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. మత గురువులు బోధనలు చేశారు.
జూపాడుబంగ్లా: మండలంలో రంజాన్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెలరోజులపాటు ఉపవాసదీక్షలు ముగిం చుకొని అల్లానామస్మరణతో ఇంటినుంచి ఈద్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థ నలు చేశారు. పండుగ విశిష్టతను ఇమాంలు వివరించారు. అనం తరం దువాచేసుకుని ఒకరినొకలు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.
మిడుతూరు: రంజాన్ పర్వదిన వేడుకలను మండంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తనకు ఉన్నదాట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని మత గురువులు తెలిపారు.
నంద్యాల క్రైం: జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఈఎస్ రవికుమార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలో ఎస్‌ఐలు బ్రహ్మయ్య, రమేష్‌బాబు, అఖిల, విశ్రాంత ఎస్‌ఐ ఉస్మాన్, సిబ్బంది అన్సర్‌బాషా, ఓబులేసు, యూవీ రమణ, ప్రసన్న, ప్రకాష్, పార్వతి, శాలిశా, ఖలీల్, భరత్, సిబ్బంది పాల్గొన్నారు.
గడివేముల: మండలంలోని అన్ని గ్రామాల్లో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థ నలు చేశారు. ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.