క్యాజువాల్టీలో ఎల్లోజోన పనులు పూర్తి
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:53 AM
క్యాజువాల్టీలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న మరమ్మతు పనులు పూర్తయ్యాయని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.

జీజీహెచ సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): క్యాజువాల్టీలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న మరమ్మతు పనులు పూర్తయ్యాయని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం కర్నూలు జీజీహెచ ధన్వంతరీ హాలులో వివిధ విభాగాల హెచవోడీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పానస సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్)లో ప్రభుత్వం వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని సమయపాలన పాటించాలని తెలియజేసిందన్నారు. ఓపీ, క్యాజువాల్టీలో కొందరు సమయపాలన పాటించడం లేదని, ఇక నుంచి తరుచూ తని ఖీలు నిర్వహిస్తామన్నారు. క్యాజువాల్టీ విభాగంలో అసిస్టెట్ ప్రొఫెసర్లు లేని యెడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యాజువాల్టీకి వచ్చే రోగులను వెంటనే అడ్మిషన అయ్యే విధంగా చూసు కుని సంబంధించిన యూనిట్‌లకు షిప్టులు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో ఆయా విభాగాల్లో ఉండే రోగులకు సంబంధించిన ఖరీదైన మందులకు ఇండెంట్ పెట్టేటప్పుడు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు సంతకం ఉండేలా చూసుకోవాలన్నారు. సమీక్షలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ కె.సీతారామయ్య, డి.శ్రీరాములు, కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు కాదేవి, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ బీవీ రావు పాల్గొన్నారు.