సర్వేలను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:52 AM
సర్వేలను వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ డీఎంహెచవో సత్యవతి ఆదేశించారు.

అడిషనల్ డీఎంహెచవో సత్యవతి
గోనెగండ్ల, మార్చి 19(ఆంధ్రజ్యోతి): సర్వేలను వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ డీఎంహెచవో సత్యవతి ఆదేశించారు. బుధవారం గోనెగండ్లలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రతిరోజు ఓపి ఎంత ఉం టుంది. రెగ్యులర్ రోగులు ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకు న్నారు. అలాగే ఆసుపత్రిలోని గదులను, స్టోర్‌రూమ్, వార్డు గదులను, ఇతర గదులను ఆమె పరిశీలించారు. రోగులకు వైద్యం సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో స్థానిక వైద్యులు రంగా ర వళి, రజిని, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.