Share News

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి: ఎస్పీ

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:02 AM

కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చార్జిషీట్‌ను కోర్టుకు దాఖలు చేయాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి: ఎస్పీ
నంద్యాల తాలూకా పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేస్తున్న ఎస్పీ

నంద్యాల క్రైం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చార్జిషీట్‌ను కోర్టుకు దాఖలు చేయాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా అన్నారు. బుధవారం నంద్యాలలోని తాలూకా పోలీసుస్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి చెప్పారు. స్టేషన్‌లోని లాకప్‌ గదులు, రికార్డులను, సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. స్టేషన్‌ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని ఆదేశించారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై మెరుగైన సేవలందించాలని సూచించారు. స్టేషన్‌ విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృత్తిపరమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని, పరిశీలించి పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. అనంతరం తాలూకా సర్కిల్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. ఎస్పీతో పాటు ఎఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్‌, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 12:02 AM