వైభవంగా సుయతీంద్రతీర్థుల మధ్యారాధన
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:51 AM
రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంధ్రతీర్థుల 12వ మధ్యారాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.

మంత్రాలయం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంధ్రతీర్థుల 12వ మధ్యారాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. బుధవారం మఠం పీఠాధి పతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో బంగారు రథంపై సుయతీంధ్ర తీర్థుల చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు, హారతుల ఇచ్చారు. అనం తరం రథం ముందుకు సాగింది. భజనలు, కోలాటాలు, చండీ వాయిద్యాలతో మఠం ప్రాంగణం మార్మోగింది. అంతకుముందు సుయ తీంద్రతీర్థుల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, క్షీరాభి షేకం, పుష్పాలు, బంగారు, వెండి ఆభరణాలతో చేసిన అలంకరణ భక్తు లను విశేషంగా ఆకట్టుకుంది. మంత్రాలయం పీఠాధిపతితో పాటు మత్తూరు మఠం పీఠాధిపతి బోధానంద సరస్వతి స్వామీజీతో కలిసి బృందావనా నికి హారతులు ఇచ్చారు. అనంతరం యాగశాలలో పండి తులు రచిం చిన పుస్తకాన్ని పీఠాధిపతి ఆవిష్కరించి పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత పండిత కేసరి విద్వాన రాజా ఎస్ గిరిరా జాచార్, ఎస్‌ఎన వెంకటేశాచార్, ఎస్‌ఎన రఘునందనాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేశ జోషి, సురేష్ కోనాపూర్, శ్రీపతాచార్, ఐపీ నరసింహమూర్తి, ఏఈ బద్రినాథ్, ద్వారపాలక అనంత స్వామి, సుధీంద్రాచార్, వ్యాసరాజాచార్, రవి కులకర్ణి, జేపీ స్వామి, అనంతపురానిక్ పాల్గొన్నారు.
అలరించిన దాసవాణి సాహిత్యం: సుయతీంద్రతీర్థుల మహారాధనలో భాగంగా బుధవారం యాగశాలలో నిర్వహించిన దాస వాని సాహిత్యం భక్తులను అలరించింది. బెంగుళూరు చెందిన రాయ చూరు శేషగిరిదాస్ దాసవాణి సాహిత్యం, హుబ్లీకి చెందిన విద్వాన శ్రీహరిఆచార్ వాలేఖర్, బెంగుళూరు చెందిన విద్వాన తిరుమలాచార్ కులకర్ణి ప్రవచనాలు వినిపించారు.