Share News

Police Transfers: పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళన

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:50 AM

పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళన మొదలైంది. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఇందుకు శ్రీకారం చుట్టగా, తాజాగా అన్నమయ్య జిల్లాపై దృష్టి పెట్టారు. చిత్తూరు జిల్లాలో ఒకేరోజు 264 మంది సిబ్బందిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు... శుక్రవారం అన్నమయ్య జిల్లాలో ఏకంగా 364 మందికి స్థానచలనం కల్పించారు. ఇందులో 41 మంది ఏఎ్‌సఐలు, 123మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 200మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఇంకా అక్కడక్కడ వైసీపీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ తన ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ వీడియో ద్వారా వేడుకున్నా పట్టించుకోలేదు.

Police Transfers: పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళన

చిత్తూరు జిల్లా నుంచి శ్రీకారం

తాజాగా అన్నమయ్య జిల్లాలో..

మొత్తం 364 మంది సిబ్బంది బదిలీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళన మొదలైంది. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఇందుకు శ్రీకారం చుట్టగా, తాజాగా అన్నమయ్య జిల్లాపై దృష్టి పెట్టారు. చిత్తూరు జిల్లాలో ఒకేరోజు 264 మంది సిబ్బందిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు... శుక్రవారం అన్నమయ్య జిల్లాలో ఏకంగా 364 మందికి స్థానచలనం కల్పించారు. ఇందులో 41 మంది ఏఎ్‌సఐలు, 123మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 200మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఇంకా అక్కడక్కడ వైసీపీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ తన ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ వీడియో ద్వారా వేడుకున్నా పట్టించుకోలేదు. ఇటీవల ఆయన హత్యకు గురికావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని, పట్టపగలు చెప్పి మరీ హత్యలు చేస్తున్న శక్తుల్ని చట్టపరంగా శిక్షించాలని డీజీపీ గుప్తాకు సీఎం చంద్రబాబు గట్టిగా చెప్పారు. దీంతో అరాచక శక్తులను అణచివేయడంతో పాటు పోలీస్‌ శాఖలో ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారు.

చిత్తూరు జిల్లా నుంచే డీజీపీ శ్రీకారం చుట్టారు. అరాచక శక్తుల్ని అదుపు చేయడంతో పాటు వారికి సహకరిస్తున్న పోలీసులను బదిలీ చేయించారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీసు స్టేషన్‌గా ముద్రపడ్డ ఒక పీఎ్‌సలో మొత్తం సిబ్బంది(42మంది)ని తొలగించి గట్టిగా పనిచేసే వారిని నియమించారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో పెద్దఎత్తున బదిలీలు చేశారు. అలాగే ఇతర జిల్లాల్లో ఇటువంటి సిబ్బందిని పక్కకు తప్పించేందుకు పోలీసు ఉన్నతాధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. రాయలసీమతో పాటు పల్నాడు, గుంటూరు, విజయవాడ, కృష్ణా ఇతర సమస్యాత్మక జిల్లాల్లో గత ఐదేళ్లలో రెచ్చిపోయిన అరాచక శక్తుల వివరాలు సేకరిస్తున్నారు. వారిపై ఉన్న కేసులు, భూ కబ్జాలు, బెదిరింపులు, ఎక్స్‌ట్రాడిషన్‌, ఫ్యాక్షన్‌, రౌడీషీట్లు, అక్రమ ఆస్తులు, అక్రమ నిర్మాణాలు, కేసుల దర్యాప్తు స్థితి, ఏపీపీ అప్పీల్‌ తీరు, ప్రస్తుతం ఆయా నిందితుల కదలికలు తదితర వివరాలన్నీ టెక్నాలజీ ద్వారా సేకరిస్తున్నారు. అరాచక శక్తులను జైలుకు పంపి, వారికి సహకరించిన ఖాకీలను సంస్కరించే పనిలో నిమగ్నమయ్యారు.


ఐపీఎ్‌సలపై వేటు

గత ప్రభుత్వంలో నిబంధనలు పక్కనబెట్టి అడ్డగోలుగా వ్యవహరించిన ఐపీఎస్‌ అధికారులు పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, పీవీ సునీల్‌ కుమార్‌, సంజయ్‌, కాంతి రాణా, విశాల్‌ గున్నీపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో విజిలెన్స్‌ అధికారిగా ఉంటూ వ్యాపారిని బెదిరించిన ఐపీఎస్‌ అధికారి జాషువాపై ఏసీబీ కేసు నమోదు చేయనుంది. ఇదే క్రమంలో మరికొందరిపైనా చర్యలకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. బూతుల నేతలు, అవినీతి అధికారులు, అరాచక చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పలు జిల్లాల్లో పది అంశాలకు సంబంధించిన సమాచారాన్ని డీజీపీ కార్యాలయం సేకరిస్తోంది. గతంలో పెద్దిరెడ్డి అనుచరులు అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా వీరంగం సృష్టించిన ఘటన కేసులపైనా అధికారులు సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:50 AM