West Godavari: మొగల్తూరు అభివృద్ధిపై పవన్ దృష్టి
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:16 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో మొగల్తూరులో గ్రామాభివృద్ధి సభ నిర్వహించి, కమిషనర్ మైలవరపు కృష్ణతేజ సమస్యలు త్వరలోనే పరిష్కారం కావాలని హామీ ఇచ్చారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డిప్యూటీ సీఎం ఆదేశాలతో గ్రామసభ
సమస్యలపై గ్రామస్థులతో చర్చలు.. నూరుశాతం పరిష్కారానికి పీఆర్ కమిషనర్ హామీ
మొగల్తూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ భరోసా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో శుక్రవారం మొగల్తూరులో నిర్వహించిన గ్రామాభివృద్ధి సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మొగల్తూరు సమస్యలు తెలుసుకునేందుకు.. ‘గ్రామస్థులు మనవద్దకు రావడం కాదు.. మనమే వెళ్లాల’ని డిప్యూటీ సీఎం.. ఆదేశించడంతో గ్రామ సభ ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామస్థులు కోరిన మేరకు ప్రతి సమస్యనూ పరిష్కరించే దిశగా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించారని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలన్నీ నూరుశాతం పూర్తవుతాయని స్పష్టంచేశారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ఇచ్చిన అవకాశాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..