Share News

April Fools Day 2025: ఏప్రిల్ 1న మాత్రమే ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Apr 01 , 2025 | 07:43 PM

April Fools Day 2025: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి తేదీని ఫూల్స్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు రకరకాల చిలిపి పనులు చేసి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజున ఏ విషయాలు చెప్పినా జోక్‌గానే తీసుకుంటారు తప్ప నిజమని నమ్మరు. ఇందుకో కారణముంది.

April Fools Day 2025: ఏప్రిల్ 1న మాత్రమే ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
How April Fools Day started

April Fools Day 2025: ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా 'ఏప్రిల్ ఫూల్స్ డే' జరుపుకుంటున్నారు. ఏప్రిల్ ఫూల్స్ డేని ఆల్ ఫూల్స్ డే అని కూడా అంటారు. ఈరోజు ప్రారంభమైనప్పటి నుంచి ఒకరినొకరు ఏదొక కారణం చెప్పి ఫూల్స్ చేసుకునేందుకు ట్రై చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో సక్సెస్ అయితే 'ఏప్రిల్ ఫూల్' అని గట్టిగా అరుస్తూ కేరింతలు కొడతారు. తమకు తెలిసిన వాళ్లందరిని వివిధ మార్గాల్లో ఫూల్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ సంప్రదాయం ఎలా మొదలైంది.. ఎందుకు రోజునే ఫూల్స్ డేగా జరుపుకుంటారని ఎప్పుడైనా ఆలోచించారా?


ఏప్రిల్ ఫూల్స్ డే ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?

ఏప్రిల్ ఫూల్స్ డే వెనుక చాలా కథలు ఉన్నాయి. చౌసర్ రాసిన 'కాంటర్బరీ టేల్స్' నుండి 'ది నన్స్ ప్రీస్ట్స్ టేల్' అనే కథల తర్వాత ఈ వేడుకలు ప్రారంభమయ్యాయని కొందరు అంటారు. 1381 సంవత్సరంలో ప్రారంభమైందని మరికొందరు చెబుతారు. ఆ సమయంలో ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ II, బోహేమియా రాణి అన్నేల నిశ్చితార్థం ప్రకటించారు. రాజు ప్రజలకు నిశ్చితార్థం తేదీ మార్చి 32 అని చెప్పాడు. అక్కడి ప్రజలు రాజు చెప్పినది అర్థం చేసుకోలేకపోయారు. నమ్మలేకపోయినా నిశ్చితార్థాన్ని పండుగలా జరుపుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మార్కెట్లు అలంకరించారు. వారంతా సన్నాహాలలో బిజీగా ఉండగా మార్చి 32 క్యాలెండర్‌లో ఉండదని కొందరు గ్రహించారు. తరువాత అందరూ తాము మోసపోయామని తెలుసుకున్నారు. ఏప్రిల్ ఫూల్స్ డే వార్త బ్రిటన్ అంతటా వ్యాపించింది. స్కాట్లాండ్‌లో అయితే ఏప్రిల్ ఫూల్స్ డే వేడుకలు రెండు రోజులు జరుపుకుంటారు. అక్కడ చిలిపివాళ్లను గౌక్స్ (కోకిల పక్షులు) అని పిలుస్తారు.


ఏప్రిల్ ఫూల్స్ డే రోజున ప్రజలు ఒకరితో ఒకరు జోక్ చేసుకుంటారు. నకిలీ వార్తలు వ్యాప్తి చేయడం, చిలిపి పనులు చేస్తూ తెలిసిన వారిని మోసగించేందుకు ప్రయత్నిస్తారు. స్నేహితులు, ప్రియమైన వారితో కలిసి జోకులు పంచుకుంటూ సరదాగా గడుపుతూ హృదయపూర్వకంగా నవ్వులతో రోజంతా ఆస్వాదిస్తారు.


Read Also: Scorpion farming: తేలు విషానికి ఎందుకంత డిమాండ్..ఈ వీడియో చూస్తే అసలు మ్యాటర్‌ మీకే అర్థమవుతుంది..

Bear Funny Video: దీనికి ఇదెవరు నేర్పించారబ్బా.. ఈ ఎలుగుబంటి ఎలా తింటుందో చూస్తే..

Viral Video: నడి రోడ్డుపై పోలీస్ భార్య డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే..

Updated Date - Apr 01 , 2025 | 07:44 PM