Rohit Sharma: మళ్లీ విఫలమైన రోహిత్ శర్మ.. మ్యాచ్ అనంతరం నీతా అంబానీతో మాటలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 07:01 PM
ముంబై టీమ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఓపెనర్ అయిన రోహిత్ వరుసగా విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ 0, 8, 13 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా 21 పరుగులు మాత్రమే చేసి అందర్నీ నిరాశపరుస్తున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు డాషింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు రాలేదు. ముంబై టీమ్ (MI) ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఓపెనర్ అయిన రోహిత్ వరుసగా విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ 0, 8, 13 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా 21 పరుగులు మాత్రమే చేసి అందర్నీ నిరాశపరుస్తున్నాడు. సోమవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో (CSK vs MI) కూడా విఫలమయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోమవారం కోల్‌కతాతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తు చేసింది. ఈ విజయం ముంబై యజమాని నీతా అంబానీ (Nita Ambani) మొహంలో ఆనందం తీసుకొచ్చింది. మ్యాచ్ అనంతరం ఆమె టీమ్ సభ్యులను అభినందించారు. ఆ సమయంలో రోహిత్ శర్మతో నీతా అంబానీ ఎక్కువ సేపు మాట్లాడారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన వైఫల్యం గురించి నీతాతో రోహిత్ చర్చించాడని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
కాగా, రోహిత్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో పలువురు మాజీలు కూడా అతడిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి గణాంకాలు రోహిత్‌వి కాకుండా, మరో ఆటగాడివి అయి ఉంటే అతడిపై ఇప్పటికే వేటు పడి ఉండేదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ విమర్శించాడు. రోహిత్ లాంటి అద్భుతమైన ఆటగాడి నుంచి జట్టు చాలా ఆశిస్తుందని, ఇలాంటి ప్రదర్శన జట్టుపై ప్రభావం చూపిస్తుందని వాన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Riyan Parag: రియాన్ పరాగ్‌కు అంత పొగరా.. అతడిపై నిషేధం విధించాలంటూ నెటిజన్ల కామెంట్లు
చార్జీకు డబ్బుల్లేవ్.. కట్ చేస్తే ఐపీఎల్ హీరో
కోహ్లీ టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాంక్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..