Share News

ఇక ప్రతీనెలా జాబ్‌మేళా

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:43 AM

‘అర్హులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చేందుకు ప్రతీనెలా జాబ్‌మేళా నిర్వహించాలి. జిల్లాను పారిశ్రామికంగా నిలదొక్కుకునేలా చేయాలి. ఆ మేరకు అందరం కష్టించి పనిచేయాలి’ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ అన్నారు.

ఇక ప్రతీనెలా జాబ్‌మేళా
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌, చిత్రంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, సొంగా రోషన్‌ కుమార్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి, జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ

అర్హత ఉన్న యువతకు ఉద్యోగాలు

వచ్చే మార్చిలోపు ఏడు వేల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన

పర్యాటక ప్రాంతాలుగా కొల్లేరు, పోలవరం

తాగునీటి కొరత రానీయొద్దు

కేంద్ర పథకాలు అందుతున్నాయో, లేదో చూడాల్సిందే..

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ పుట్టా

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

‘అర్హులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చేందుకు ప్రతీనెలా జాబ్‌మేళా నిర్వహించాలి. జిల్లాను పారిశ్రామికంగా నిలదొక్కుకునేలా చేయాలి. ఆ మేరకు అందరం కష్టించి పనిచేయాలి’ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ అన్నారు. ఏలూరులోని గోదావరి సమావేశపు హాలులో శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఎంపీ అధ్యక్షత వహించారు. వచ్చే మార్చిలోగా జిల్లాలో ఏడు వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రతీనెలా జాబ్‌ మేళాలు నిర్వహించడం, సమాం తరంగా పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రా మికవేత్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల న్నారు. వివిధ అంశాలపై సమావేశంలో ఆయన చర్చిస్తూ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నిలిపే బాధ్యతను అందరూ తీసుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూమికి అవసరమైన ల్యాండ్‌ బ్యాంక్‌ వివరాలను సేకరించాల్సిందిగా అధికా రులను ఆదేశించారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతీ ఇంటి కి కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు. రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్త కుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2.58 లక్షల కుటుంబాలకు పని దినాలు కల్పించాలని, 40 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద 206 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రెయినేజి వంటి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్స రంలో జిల్లాలో తొమ్మిది వేల ఎకరాల్లో ఉద్యాన పంట లు సాగయ్యేలా చూడాలన్నారు. సుమారు రూ.109 కోట్లతో ప్రతిపాదించిన ఉంగుటూరు–కైకలూరు రోడ్డు నిర్మాణ పనులపై చర్యలు తీసుకోవాలని, టి.నర్సాపురం– చింతలపూడి, టి.నర్సాపురం– జంగారెడ్డిగూడెం రోడ్ల నిర్మాణ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలన్నారు. దేశంలో 50 ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభి వృద్ధి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుందని, వీటిలో మన జిల్లాలోని కొల్లేరు, పోలవరం ప్రాజెక్టు ప్రాంతా లను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అవసర మైన ప్రతిపాదనలను సమర్పించాలని ఎంపీ అధికా రులను ఆదేశించారు.

భీమడోలు మండలం మల్లవరం, చెట్టున్నపాడుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ కోరగా మంగళవారం నుంచే ఆగడాల లంక ఛానల్‌ నుంచి తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్‌ ఎస్‌ఈ నాగార్జున చెప్పారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే రూ.1,830 కోట్ల విలువైన 4,302 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్‌ బ్యాంక్‌ ద్వారా గుర్తించామని కలెక్టర్‌ వెట్రిసెల్వి సమావేశం దృష్టికి తెచ్చారు. జిల్లాలో ఏప్రిల్‌ 10న జాబ్‌మేళా నిర్వ హించి వెయ్యి మందికి ఉపాధి కల్పించే దిశగా కార్యాచ రణ సిద్ధం చేసినట్టు ప్రకటించారు. సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌, జేసీ పి.ధాత్రిరెడ్డి, జడ్పీ సీఈవో భీమేశ్వరరావు, డీఆర్‌డీఎ పీడీ విజయరాజు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ నాగార్జున రావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ త్రినాథబాబు, వ్యవసాయాధికారి హబీబ్‌ పాషా, ఉద్యాన శాఖ డీడీ రామ్మోహన్‌, డీఎం హెచ్‌వో డాక్టర్‌ మాలిని, డీఈవో వెంకటలక్ష్మమ్మ, పౌర సరఫరాల మేనేజర్‌ శ్రీలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ భానుప్రతాప్‌ పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీలో పది మంది పేర్లను ఎంపీ ప్రతిపాదించారు. నత్తా దివ్యదీప్తి, చీకటి తవిత, అడపా నాగలక్ష్మి, ముసునూరు లక్ష్మి, రందే లక్ష్మీసునీత, షేక్‌ కరీముల్లాషా కాదిరి, జంగం వెంకటేశ్వరరావు, మొడియం శింగరాజు, పిల్లరిశెట్టి సంధ్య, ఆలూరి రమేష్‌కుమార్‌లను నియమించాలని జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వికి ప్రతిపాదించారు.

ఎన్నిసార్లు చెప్పాలి సార్‌ : చింతమనేని

‘పదేపదే సమస్యను చెప్పడానికి అధికారులను పిలుస్తున్నాను. కాని ఏ ఒక్కరూ రావడమేలేదు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఎక్కడో ధవళేశ్వరం నుంచి 120 కిలోమీటర్ల మేర పైప్‌లైను వేసి గోదావరి జలాలు తెచ్చేదానికంటే ప్రత్యామ్నాయంను నేను చాలాసార్లు అధికారుల ముందుంచాను. నా నియోజకవర్గ పరిధిలోని జానంపేట వద్ద పోలవరం కుడి కాల్వ ద్వారా పైపులైను నిర్మిస్తే పది కిలోమీటర్ల దూరంలోనే అటు ఏలూరుకు, ఇటు దెందులూరు నియోజకవర్గానికి సులభంగా తాగునీరు అందించ వచ్చు. ఈ విషయంలో సమగ్ర నివేదికలు సమర్పిం చారా, లేదా అని అడుగుతూనే ఉన్నా. ఇదిగో సబ్‌ మిట్‌ చేశామని, పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రక్షిత తాగునీటి పథకాలకు ఫిల్టర్‌బెడ్స్‌ మార్పు చేయాల్సిందే. ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు మరమ్మతులు చేపట్టాలి.

కొల్లేరు సమస్యకు త్వరలో పరిష్కారం

మానవత దృక్పథంతో కొల్లేరు సమస్య చిక్కుముడిని అందరి సమష్టి కృషితో పరిష్కరించేందుకు కృషి చేస్తా మని ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ అన్నారు. సమా వేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొల్లేరుకు సంబంధించి స్థానికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. సుప్రీం ఆదేశాల మేరకు సమాచారాన్ని పూర్తిగా సమ ర్పించేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఈ సున్నితమైన సమస్య పరిష్కారానికి చాలా సమయం పట్టే కనపడుతున్నప్పటికీ వంద శాతం పరిష్కరి స్తామన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:43 AM