Share News

ప్రజాపత్రిక ఆంధ్రజ్యోతి

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:04 AM

అనునిత్యం ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్న ఆంధ్రజ్యోతి ప్రజాపత్రికగా ఖ్యాతిగడించిందని కలెక్టర్‌ పి.రంజిత బాషా పేర్కొన్నారు.

   ప్రజాపత్రిక ఆంధ్రజ్యోతి
విజేతలను ఎంపిక చేసిన కలెక్టర్‌, ఎస్పీ

కలెక్టర్‌ పి. రంజిత బాషా

‘ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌’ విజేతలను ఎంపిక చేసిన కలెక్టర్‌, ఎస్పీ

గూడురు పాఠకుడిని వరించిన అదృష్టం

నంద్యాల జిల్లాకు ద్వితీయ బహుమతి

తృతీయ విజేత కోడుమూరు వాసి

కర్నూలు కల్చరల్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): అనునిత్యం ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్న ఆంధ్రజ్యోతి ప్రజాపత్రికగా ఖ్యాతిగడించిందని కలెక్టర్‌ పి.రంజిత బాషా పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక నాలుగు నెలలుగా నిర్వహించిన ‘కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌’ విజేతలను కలెక్టర్‌ పి.రంజితకుమార్‌, ఎస్పీ విక్రాంత పాటిల్‌ లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి దినపత్రిక పాఠకులకు మరింత చేరువయ్యేలా కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ కూపన్లు ఏర్పాటు చేసి, వారికి మంచి బహుమతులు అందజేయడం ప్రశంసనీయమని అన్నారు. కలెక్టర్‌ రంజిత బాషా పదివేలకు పైగా ఉన్న కూపన్ల నుంచి ఒక కూపన తీసి మొదటి బహుమతి ‘బైక్‌’ గెలుపొందిన విజేత డి.వీరేష్‌ కుమార్‌ (గూడూరు)ను ప్రకటించారు. అనంతరం కూపనలోని సెల్‌ నెంబరు ద్వారా విజేతతో కలెక్టర్‌ మాట్లాడి అభినందించారు. ఎస్పీ విక్రాంత పాటిల్‌ మరో కూపనను తీసి ద్వితీయ బహుమతి ‘రిఫ్రిజ్‌రేటర్‌’ గెలుపొందిన విజేత నంద్యాలకు చెందిన పి.శంకర నారాయణను ప్రకటించారు. విజేతతో ఎస్పీ ఫోన చేసి అభినందించారు. ఆంధ్రజ్యోతి ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రాంచ మేనేజర్‌ ఎ.లక్ష్మన ఒక కూపన తీసి తృతీయ బహుమతి ‘ఎల్‌ఈడీ టీవీ’ గెలుపొందిన చాకలి వెంకటేశ్వర్లు (కోడుమూరు)ను ప్రకటించారు. జిల్లా బ్రాంచ మేనేజర్‌ ఎ.లక్ష్మన మాట్లాడుతూ జిల్లాలో పోటీకి వచ్చిన కూపన్లను విజయవాడలో జరిగే రాష్ట్ర పోటీలకు పంపిస్తామని, అక్కడ తీసిన లక్కీ డ్రాలో కారును గెలుచుకున్న విజేతను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి డిప్యూటి సర్కులేషన మేనేజర్‌ సోమశేఖర్‌ రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిషన ఇనచార్జి చల్లా నవీనకుమార్‌ నాయుడు, బ్యూరో ఇనఛార్జి గోరంట్ల కొండప్ప, నంద్యాల స్టాఫ్‌ రిపోర్టర్‌ గోపాలకృష్ణ, ఏబీఎన ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ సుంకన్న, ఆంధ్రజ్యోతి యాడ్స్‌ మేనేజర్‌ గోపాల్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠకులకు ప్రోత్సాహం

ఏ దినదపత్రిక చేయలేని విధంగా పాఠకులను ఆంధ్రజ్యోతి ప్రోత్సహిస్తోందని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు. లక్కీ కూపన్ల ద్వారా పాఠకులను బహుమతుల ద్వారా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. వార్తలు నిక్కచ్చిగా, నిర్భయంగా రాస్తూ దమ్మున పత్రికగా ఆంధ్రజ్యోతి, దమ్మున్న చానెల్‌గా ఏబీఎన నిలుస్తోందని కొనియాడారు.

ఫోటోలు - 1, 1ఏ గూడూరులో ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ లక్కీ డ్రాలో ప్రఽథమ బహుమతి బైక్‌ సోంతం చేసుకోన్న డమాం వీరేష్‌ సంతోషం వ్యక్తం చేస్తున్న దృశ్యం

కలెక్టర్‌ ఫోన చేశారు..

- డమాం వీరేష్‌, గూడూరు, ప్రథమ(బైక్‌) విజేత

కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ లక్కీ డ్రాలో ప్రఽథమ బహుమతిగా బైక్‌ గెలుచుకున్నట్లు కలెక్టర్‌ నుంచి ఫోన వచ్చింది. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆంధ్రజ్యోతి దిన పత్రికను సంవత్సరం చందా ద్వారా తీసుకున్నా. ఆంధ్రజ్యోతి పత్రిక అంటేనే గుర్తుకొచ్చేది నిఖార్సయిన జర్నలిజం. అనునిత్యం ప్రజల సమస్యలను ప్రచురించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. బైక్‌ గెలుచుకున్నట్లు నాకు ఫోన ద్వారా విషయం తెలియగానే బంధువులకు, స్నేహితులకు చెప్పి ఆనందాన్ని పంచుకున్నా.

్డ్ఞచాలా సంతోషంగా ఉంది

- పువ్వాడ శంకర నారాయణ, నంద్యాల, ద్వితీయ(రిఫ్రిజిరేటర్‌) విజేత

సుదీర్ఘకాలంగా ఆంధ్రజ్యోతి పత్రికను చదువుతున్నా. ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందువల్ల ప్రజలకు మరింత చేరువగా ఉండడం నాకు నచ్చింది. అందుకే పది సంవత్సరాలుగా అభిమాన పాఠకుడిగా ఉంటున్నాను. ఆరు సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి కూపన్లు పంపుతున్నా. శనివారం తీసిన డ్రాలో అదృష్టవశాత్తు ద్వితీయ బహుమతికి ఎంపిక చేశారని కర్నూలు ఎస్పీ విక్రాంత పాటిల్‌ నాకు ఫోన ద్వారా తెలియజేసి అభినందించారు. రిఫ్రిజిరేటర్‌ వస్తుందని తెలియజేశారు. కార్మికుడిగా పనిచేసే నాకు ఇలాంటి అదృష్టం దక్కడం ఆనందంగా ఉంది.

చాలా ఆనందంగా ఉంది

- సి.వెంకటేశ్వర్లు, కోడుమూరు, తృతీయ(ఎల్‌ఈడీ టీవీ) విజేత

ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ లక్కీ డిప్‌లో మూడో బహుమతిని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రజ్యోతి న్యూస్‌ చదవడం అంటే చాలా ఇష్టం. 5 సంవత్సరాల నుంచి ఆంధ్రజ్యోతి పత్రికను మాత్రమే చదువుతున్నారు. అందులో వచ్చే వార్తలు తనను చాలా ఆకట్టుకుంటాయి. ఇలాంటి పత్రికలో ప్రతి ఏడాది కార్‌ అండ్‌ బైక్‌రేస్‌ అంటూ కూపన్లు రిలీజ్‌ చేయడం మరింత ఆనందం వేసింది. ఈ ఏడాది ఎలాగైనా బహుమతిని అందుకోవాలని కూపన్లు జాగ్రత్తగా దాచుకొని పంపించాను. మూడో బహుమతిగా ఎల్‌ఈడీ టీవీని గెలుచుకున్నట్లు నేరుగా కలెక్టర్‌ ఫోన చేయడం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి.

Updated Date - Mar 23 , 2025 | 01:04 AM