Share News

‘ఉపాధి’లో పంచ ప్రాధాన్యాలు

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:04 PM

ఉపాధి హమీ పథకంలో వచ్చే మూడు నెలల్లో ఐదు రకాల పంచ ప్రా ధాన్యాలే లక్ష్యంగా పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు జిల్లా డ్వామా ప్రాజెక్టు అధి కారి జోసఫ్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక ఉపాధి కా ర్యాలయాన్ని సందర్శించేందుకు గురువారం విచ్చేసిన ఆ యన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రా మీణ ప్రాంతాల్లో మూగజీవాలకు నీటి సౌకర్యం ఉం డేలా నిర్ధేశించిన లక్ష్యం మేరకు రానున్న 15 రోజుల్లో 1470 నీటితొట్ల నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపడు తున్నట్టు చెప్పారు.

‘ఉపాధి’లో పంచ ప్రాధాన్యాలు
మాట్లాడుతున్న పీడీ జోసఫ్‌కుమార్‌

15 రోజుల్లో

1470 నీటితొట్ల నిర్మాణాలు

భూగర్భ జలాలు పెంపుదలే లక్ష్యంగా కుంటలు

చెరువుల్లో పూడికతీతకు చర్యలు

డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ జోసఫ్‌కుమార్‌

దొనకొండ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఉపాధి హమీ పథకంలో వచ్చే మూడు నెలల్లో ఐదు రకాల పంచ ప్రా ధాన్యాలే లక్ష్యంగా పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు జిల్లా డ్వామా ప్రాజెక్టు అధి కారి జోసఫ్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక ఉపాధి కా ర్యాలయాన్ని సందర్శించేందుకు గురువారం విచ్చేసిన ఆ యన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రా మీణ ప్రాంతాల్లో మూగజీవాలకు నీటి సౌకర్యం ఉం డేలా నిర్ధేశించిన లక్ష్యం మేరకు రానున్న 15 రోజుల్లో 1470 నీటితొట్ల నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపడు తున్నట్టు చెప్పారు. ఒక్కో నీటితొట్టి నిర్మాణానికి రూ.30 వేల వ్యయంతో నాలుగు వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉండేలా పెద్దఎత్తున నిర్మాణాలు చేపడుతున్నామన్నా రు. నిర్మాణాల అనంతరం ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖల పర్యవేక్షణలో నీటితోట్లలో మూగజీవాలకు నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపడతారన్నారు.

రెండవ ప్రాధాన్యతగా రైతుల పొలాల్లో పడిన వర్షపు నీటిని కుంటల్లోకి మళ్లించి, ఆనీటితో పంటల ను సంర క్షించాలని తలపెట్టినట్టు చెప్పారు. తద్వార భూగర్భజ లాలను పెంపొందించుకోవటమే లక్ష్యంగా రైతుల పొలా ల్లో నీటినిల్వ కుంటలు(ఫాంఫండ్స్‌) నిర్మాణాలు చేపడు తున్నట్టు చెప్పారు.

మూడవ ప్రాధాన్యతగా గ్రామాల్లో చివరి ఆయకట్టు పొలాలకు నీరు చేరుకునేలా చెరువులు, కుంటలలో, వాగులు, వంకలలో పూడికతీత తొలగింపే లక్ష్యంగా ఫీ డర్‌ ఛానల్‌లో పూడికతీత చేపడుతున్నట్టు చెప్పారు.

నాల్గవ ప్రాధాన్యతగా గ్రామాల్లోని చెరువులు కనుమ రుగవుతున్న నేపథ్యంలో గ్రామానికి ఒక చెరువు అనే లక్ష్యంతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నా మన్నారు. చెరువుల్లో పూడికతీత, కట్టల బలోపేతం వంటి పనులు చేపట్టి రైతులకు నీటి సౌకర్యం కల్పిం చనున్నట్టు చెప్పారు.

ఐదో ప్రాధాన్యతగా ఉపాధి పనులు చేపట్టే కూలీలకు కనీస సగటు వేతనం రూ.300 ఉండేలా చర్యలు తీసు కుంటున్నట్టు చెప్పారు. ఇందులోభాగంగా గ్రూప్‌ మా ర్కింగ్‌ ఇచ్చి కొలతల ప్రకారం కనీసం నాలుగు గంటలు పనిచేయాలన్నారు. పని కోరుకునే వారిలో కనీసం 1/3 వంతు గడ్డపారలను తెచ్చుకొని పనులు చేసుకునేలా చ ర్యలు చేపడుతున్నట్టు జోసఫ్‌కుమార్‌ వివరించారు.

ఈసందర్భంగా ఉపాధి సిబ్బంది జోసఫ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం సిబ్బందితో సమా వేశం నిర్వహించి అనేక విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో ఆదాం షఫీ, ఏపీడీ నిర్మలాదేవి, ఏపీవో టి.దేవయ్య, ఈసీ రమే ష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:04 PM