Share News

సంప్రదాయబద్ధంగా ఉగాది

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:22 AM

పట్టణంలో విశ్వావసు నామసంవత్సర ఉగాది మహోత్సవాలు ఆదివారం సాంప్రదాయబద్ధంగా నిర్వ హించారు.

సంప్రదాయబద్ధంగా ఉగాది

మార్కాపురం వన్‌టౌన్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో విశ్వావసు నామసంవత్సర ఉగాది మహోత్సవాలు ఆదివారం సాంప్రదాయబద్ధంగా నిర్వ హించారు. ప్రజలు ఇళ్ల వద్ద మామిడి ఆకులు కట్టి షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేసి ఇరుగు పొరుగుకు పంచారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. దేశకాలమాన పరిస్థితులు, రాశుల ప్రకారం ఆదాయ, వ్యయాలు వివరించారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, దేశం సుభిక్షంగానే ఉంటుంద న్నారు. ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి, ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌ యక్కలి కాశీవిశ్వనాథం తదిత రులు పాల్గొన్నారు.

పెదమస్తానమ్మ ఆలయంలో...

మార్కాపురం రూరల్‌: మండలంలోని జమ్మన పల్లి గ్రామం వద్ద వెల సిన ముద్దసానమ్మ ఆల యంలో ఉగాది పర్వ దినం సందర్భంగా ఆది వారం అమ్మవారికి ప్రత్యే క పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద మస్తానమ్మ అమ్మవారి మూలవిరాట్‌ను పూలతో ప్రత్యేకంగా అలంకరిం చారు. కుంకుమార్చన, అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు శాస్త్రోత్తంగా నిర్వ హించారు. భక్తులు అమ్మవారికి భక్తితో తీసుకు వచ్చిన పట్టువస్తాలతో అలంకరించారు. పరిసర ప్రాంతాల, గ్రామాల నుంచి మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించారు. కాయాకర్పూరం కానుక లు సమర్పించుకున్నారు. మార్కా పురం పట్టణ ఎస్‌ఐ సైదుబాబు దంపతులు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, యువకులు, మహిళా భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బొడిచెర్ల వీరాంజనేయస్వామి ఆలయంలో..

మండలంలోని బొడిచెర్ల గ్రామంలో వెలసిన వీరాం జనేయ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రత్యేక అహాషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులకు ఆలయ కమిటీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. సాయంత్రం మహిళలతో కోలాటం కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా ఉగాది వేడుకలు

కంభం : కంభం, అర్థవీడు మండలాల్లోని ప్రజలు ఆదివారం విశ్వవసు నామ ఉగాది పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఉగాది పండుగతో ప్రారంభ మయ్యే తెలుగు సంవత్సరాది సందర్భంగా తాము చేసే వృత్తికి, ఆర్ధిక స్థిరత్వానికి, కుటుంబసభ్యు లందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని పూజ లు చేశారు. పండుగ సందర్భంగా వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు భక్తులతో రద్ధీగా మారింది. సాయంత్రం 5 గంటలకు గుండెపూడి శ్రీనివాసశర్మతో పంచాంగ శ్రవణం నిర్వహించారు.

పంచాంగ శ్రవణం

గిద్దలూరు : మండల ప్రజలు ఆదివారం ఉగాది పర్వదినాన్ని భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. రైతులు తమఇళ్లలో పూజలు చేసుకుని పొలాల్లో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆయా రాశుల వారికి నక్షత్రాలను బట్టి ఆదాయ, వ్యయాలను పురోహితులు చెప్పారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు వాడకట్టు రంగసత్యనారాయణ, కార్యదర్శి తుమ్మల పెంట సత్యనారాయణ, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నా రు. పాత బద్వేల్‌ రోడ్డులోని రామాలయంలో వసంత నవరాత్రుల కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు స్వామి వారికి విశేష పూజలు చేశారు. భక్తులు కుంకుమార్చన, విష్ణుసహస్త్రనామ పారాయ ణంలో పాల్గొన్నారు. అలాగే పంచాంగ శ్రవణం నిర్వహించి ఉగాది పచ్చడి అందించారు.

భక్తిశ్రద్ధలతో ఉగాది

తర్లుపాడు : మండలంలో ఉగాది పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రజలు నిర్వహించారు. ప్రతి ఇంటా స్వామివార్లకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. సాయంత్రం రైతులు ఏరువాక కార్యక్ర వన్ని నిర్వహించారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో ఓరుగంటి పవన్‌ప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో పంచాగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయభాస్కర్‌ రావు, ప్రజలు పాల్గొన్నారు.

సాయిమందిరంలో ఉగాది వేడుకలు

మార్కాపురం వన్‌టౌన్‌ : నెహ్రూ బజార్‌లోని షరిడీ సాయి మందిరంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. పట్టణానికి చెందిన పలురంగాల్లో ప్రముఖులైన 15 మందికి విశిష్ఠ సేవాపురస్కారాలు ఇచ్చి సత్కరించారు. డాక్టర్‌ చెప్పల్లి కనకదుర్గ, కాలంరాజు రామకృష్ణ, కృష్ణమూర్తి, రజినీకుమార్‌, చిత్తారి రంగనాయకులు, పురాణం సుబ్రహ్మణ్యం, మద్దెల సుబ్బారావు, ఎం.నాగ మల్లికార్జునరావు, గుంటక సుబ్బారెడ్డి, నారాయణం తులసి, సీఐ సుబ్బారావు, ఆర్కేజే నరసింహరావు, పీవీ కృష్ణారావు తదితరులను సత్కరించారు. కార్యక్రమం లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్‌వీ రమణ, తాలుకా ఎన్‌జీవో సంఘం అధ్యక్షులు శ్రీనివాసశాస్త్రీ, సాయిమందిర అధ్యక్ష, కార్యదర్శులు పేరం సత్యనారా యణ, గోపాలుని హరిహరరావు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల : మండలంలో ఉగాది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలుగువారు పం చాంగం ప్రకారం క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ విశ్వావసు నామంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి వెళ్లారు. ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా దీవించాలని మ్రొక్కుకున్నారు.

ఘనంగా ఉగాది వేడుకలు

గిద్దలూరు టౌన్‌ : విశ్వవసునామ సంత్సరం ఉగాది పండుగ అందరకీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు , ఆర్థికాభివృద్ధి ఉండాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పండితులు పంచాంగశ్రవణం చేశారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లా డుతూ ఉగాది నూతన సంవత్సరానికి అంకురార్పణ చేసి కొత్త ఆశయాలు, లక్ష్యాలు సాధించే దిశగా ప్రతతి ఒక్కరికి స్పూర్తినిచ్చే పర్వదినమన్నారు. ఈ సంవత్స రం రైతులకు సకాలంలో వర్షాలు కురిసి మంచి దిగుబడి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ఉగాది వేడుకలు

పుల్లలచెరువు : నూతన తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని మండలంలోని అన్నిగ్రామాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం మండల కేంద్రమైన పుల్లలచెరువులోని గాంధీబొమ్మ కూడలిలో విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా పంచాంగశ్రవణ పురాణం వేదపండితులు వినిపించారు. గ్రామాల్లోని రైతులు వేకువ జామునే పొలాలకు వెళ్లి ఏరువాక సాగారు. ఎడ్లకు నేలతల్లికి మొక్కుకున్నారు. మండలంలోని శివాలయాలు,కోమరోలు నరసింహాస్వామి, ఆంజనేయస్వామి , లక్ష్మితిరుపతమ్మ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో ఉగాది

ఎర్రగొండపాలెం: మండలంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగను మండల ప్రజలు ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో పూజలు నిర్వహించా రు. రైతులు ఎద్దులను, ఆవులను పసుపు కుంకుమలు చల్లి పూజలు చేశారు. గ్రామాల్లో రైతులు అరక ఎద్దులతో ఏర్వాక సాగారు. సంవృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు పండాలని, గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో రైతులు పూజలు నిర్వహించారు.

ఎర్రగొండపాలెం రూరల్‌ : ఉగాది పండుగ సంద ర్భంగా ఎర్రగొండపాలెం మండలంవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే స్థానిక శివాలయంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డైరీని, క్యాలెండర్‌ను పలువురు ఆవిష్కరించారు.

Updated Date - Mar 31 , 2025 | 12:22 AM