Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 31 03 2025

ABN , Publish Date - Mar 31 , 2025 | 06:01 AM

‘అసంకల్పిత పద్యం’ కవితా సంపుటి, ‘నేల తడుముతూనే’ కవితా సంపుటి, జయమిత్ర పురస్కారం, హాస్య, వ్యంగ్య కథల పోటీ...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 31 03 2025

గత వారం వివిధలో (24.03.2025) ప్రచురిత మైన ‘దళిత కవితకు తార్కిక పదును’ అన్న వ్యాసానికి సాంకేతిక కారణం వల్ల రచయిత పేరు అచ్చు కాలేదు.

ఆ వ్యాస రచయిత శీలం భద్రయ్య (98858 38288). పొరపాటుకు చింతిస్తున్నాం.

– వివిధ

‘అసంకల్పిత పద్యం’ కవితా సంపుటి, ‘నేల తడుముతూనే’ కవితా సంపుటి, జయమిత్ర పురస్కారం, హాస్య, వ్యంగ్య కథల పోటీ

కవిసంధ్య సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శేషభట్టర్ రఘు కవితా సంపుటి ‘అసంకల్పిత పద్యం’ ఆవిష్కరణ ఏప్రిల్ 6 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షుడు శిఖామణి; ఆవిష్కర్త వాడ్రేవు చినవీరభద్రుడు; వక్తలు కొప్పర్తి, తూముచర్ల రాజారామ్, నాళేశ్వరం శంకర్, పి. శ్రీనివాస్ గౌడ్.

కవిసంధ్య

‘నేల తడుముతూనే’ కవితా సంపుటి

తెరసం జంట నగరాలు – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గుండెల్లి ఇస్తారి ‘నేల తడుముతూనే’ కవితా సంపుటి ఆవిష్కరణ ఏప్రిల్‌ 6 ఉ.10 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త నందిని సిధారెడ్డి; అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు; విశిష్ట అతిథి నాళేశ్వరం శంకరం. రూప్ కుమార్ డబ్బికార్, కొండపల్లి నీహారిణి తదితరులు పాల్గొంటారు.

కందుకూరిశ్రీరాములు


జయమిత్ర పురస్కారం

జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు జి. చెన్నకేశవరెడ్డి జన్మదినం సందర్భంగా నందిని సిధారెడ్డికి పురస్కారం సగౌరవ సమర్పణ కార్యక్రమం ఏప్రిల్‌ 7 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షులు అమ్మంగి వేణుగోపాల్‌; ముఖ్య అతిథి వెలుదండ నిత్యానందరావు; విశిష్ట అతిథులు ఏనుగు నరసింహారెడ్డి, నాళేశ్వరం శంకరం; ఆత్మీయ అతిథులు ఎం.కె. రాము, ఎం. శంకర్‌ రెడ్డి తదితరులు పాల్గొంటారు.

రాయారావు సూర్య ప్రకాశరావు

హాస్య, వ్యంగ్య కథల పోటీ

కీ.శే. ఎ.వి. చయనులు స్మృతిలో కథలను ఆహ్వానిస్తున్నాం. 45 ఏళ్ళ లోపు వాళ్ళు మాత్రమే పంపాలి. పేజీల పరిమిఇతి లేదు. హాస్య, వ్యంగ్య రచనలకి ప్రాధాన్యం. ఒకరు ఒక కథ మాత్రమే పంపాలి. ఎంపికైన కథకు రూ.10వేల బహుమతి. కథలు జూన్‌ 25లోగా యూనికోడ్/ పిడిఎఫ్‌లో ఈమెయిల్‌: vidyasagarsriadibhatla@ gmail.com కు పంపాలి. వివరాలకు ఫోన్‌: 94923 40651.

ఎస్‌. ఎ. విద్యాసాగర్‌

Updated Date - Mar 31 , 2025 | 06:01 AM