Share News

మాజీ సీఎం జగన్‌ను అరెస్ట్‌ చేయాలి

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:26 PM

రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ కొండపి మండలం ముప్పవరం గ్రామానికి చెందిన దొడ్డక నరసింహరాజు బుధవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

మాజీ సీఎం జగన్‌ను అరెస్ట్‌ చేయాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న నరసింహరాజు

రేషన్‌ బియ్యం పంపిణీపై విచారణ చేయాలని డిమాండ్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌2(ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ కొండపి మండలం ముప్పవరం గ్రామానికి చెందిన దొడ్డక నరసింహరాజు బుధవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం, మరోసారి కేంద్రప్రభుత్వం ఉచితంగా రేషన్‌బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే కార్డుదారులకు అందజేసిందని ఆరోపించారు. ఉచితంగా అందజేయాల్సిన బియ్యం పంపిణీ చేయకుండా భారీ అక్రమాలకు జగన్‌ పాల్పడ్డారని, దీనిపై సమగ్ర విచారణ చేసి ప్రజల సొమ్మును రాబట్టాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే బియ్యం పంపిణీ చేసే వాహనాలను రద్దు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, ఈ మేరకు వాహనాలను రద్దు చేసి పేదలకు నెలకు రెండుసార్లు బియ్యం పంపిణీ చేయాలని ఆయన కోరారు.

Updated Date - Apr 02 , 2025 | 11:26 PM