Share News

కల్యాణం.. కమనీయం

ABN , Publish Date - Apr 06 , 2025 | 10:46 PM

శ్రీరామనవమి వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకు న్నారు. ఆలయాల్లో సీతారామ కల్యాణం వైభవంగా నిర్వహిం చారు. కనిగిరి పట్టణంలోని రామాలయం వీధిలోని దేవాలయంలో కొలువైన శ్రీసీతారాములకు ఘనంగా కల్యాణ వేడుకలు నిర్వహించారు. ప్రముఖులు, వ్యా పార వేత్తలు ఊరేగింపుతో, మేళతాళాల నడుమ సీ తాసమేత స్వామి వారికి ముత్యాల తలంబ్రాలను అం దజేసి పట్టు వస్త్రాలు సమర్పించారు.

కల్యాణం.. కమనీయం
కనిగిరి: స్వామివారి ఊరేగింపులో పల్లకి మోస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు

ఆలయాల్లో మారుమోగిన రామనామస్మరణ

పలుచోట్ల అన్నదానాలు

ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం

కనిగిరి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకు న్నారు. ఆలయాల్లో సీతారామ కల్యాణం వైభవంగా నిర్వహిం చారు. కనిగిరి పట్టణంలోని రామాలయం వీధిలోని దేవాలయంలో కొలువైన శ్రీసీతారాములకు ఘనంగా కల్యాణ వేడుకలు నిర్వహించారు. ప్రముఖులు, వ్యా పార వేత్తలు ఊరేగింపుతో, మేళతాళాల నడుమ సీ తాసమేత స్వామి వారికి ముత్యాల తలంబ్రాలను అం దజేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. కొత్తపేట లోని కోదండరామస్వామి దేవాలయంలో పూజలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్‌భజన సం ఘం వద్ద, కేటీఆర్‌ స్కూల్‌లోని శ్రీలక్ష్మీనర సింహస్వా మి ఆలయం, బాబా ఆలయం, చింతలపాలెం, కొత్తూ రు, కూచిపూడిపల్లి, మాచవరం, చీర్లదిన్నె, లింగా రెడ్డిపల్లి, ఏరువారిపల్లి, పునుగోడు, చల్లగిరగల, గాను గపెంట, నందనమారెళ్ళ తదితర గ్రామాల్లో సీతారా ముల కల్యాణాలను ఘనంగా నిర్వహించారు.

ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి పట్టణం లోని రామాలయాలను దర్శించి సీతారాములకు ప్రత్యే క పూజలు చేశారు. రామాలయం వీధిలోని రామాల యంలో స్వామివార్లను దర్శించుకుని అర్చనలు చేశా రు. స్వామివారి ఉత్సవ ఊరేగింపులో పాల్గొని సీతా రాముల పల్లకిని మోశారు. సీతారాములకు పట్టువ స్ర్తాలు సమర్పించారు. కల్యాణానికి ముత్యాల తలం బ్రాలను అందజేశారు. హనుమంతునిపాడు మండ లంలోని ఎమ్మెల్యే స్వగ్రామం తిమ్మారెడ్డిపల్లి గ్రామం లోని రామాలయం, వెంగపల్లి గ్రామంలోని దేవాల యంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట టీడీపీ నాయకులు వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి), సత్యాలు, కొలిపర్తి మా రుతి, వెలుగూరి చంద్ర తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 10:46 PM