Share News

అధ్వానంగా పాములపల్లె రహదారి

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:55 AM

గిద్దలూరు మున్సిపాలిటీలో భాగమైన పాములపల్లి గ్రామం వెళ్లాలంటే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధ్వానంగా పాములపల్లె రహదారి

గిద్దలూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): గిద్దలూరు మున్సిపాలిటీలో భాగమైన పాములపల్లి గ్రామం వెళ్లాలంటే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిద్దలూరు నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో పాములపల్లి గ్రామం ఉంది. 3 కిలోమీటర్లలో 30కి పైగా ప్రాంతాలలో రోడ్డం తా అధ్వానంగా తయారైంది. పేరుకు తారు రోడ్డు అయినప్పటికీ, మట్టిరోడ్డు కంటే అధ్వానంగా ఉంది. తారు పోయి కంకర రాళ్లు లేచి గుంతలమయైుంది. దీంతో వాహనాలు వెళ్లే సమయంలో టైర్ల కింద కంకరరాళ్లు లేచి పక్కన ఉన్న వారిని గాయపరుస్తున్నాయి. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు కింద పడి గాయాలపాలు అవుతున్నారు. ఈ రోడ్డును పూర్తిస్థాయిలో పునః నిర్మించాలని పాములపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 12:55 AM