Share News

విద్యుత్‌ బిల్లుల నుంచి విద్యాలయాలకు విముక్తి

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:28 PM

నియోజకవర్గంలో విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉండగా, నానా యాతన పడుతున్న ఉపాధ్యాయులకు టీడీపీ కూటమి ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. గత వైసీపీ పాలకులు విద్యారంగ అభివృద్ధిని గాలికొదిలేశారు. కేవలం ప్రచారార్భాటాలకే పరిమితమయ్యారు. విద్యార్థులకు అందించిన కిట్‌లు నాణ్యతా లోపంతో రోజులకే మూలనపడ్డాయి. నాడు - నేడు అంటూ కాసులు దండుకుందే తప్ప పూర్తి స్థాయిలో పనులు జరిగిన దాఖలాలు లేవు.

విద్యుత్‌ బిల్లుల నుంచి విద్యాలయాలకు విముక్తి

సుమారు రూ.20లక్షల వరకు ఊరట

కూటమికి జై కొడుతున్న ఉపాధ్యాయులు

చీరాల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉండగా, నానా యాతన పడుతున్న ఉపాధ్యాయులకు టీడీపీ కూటమి ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. గత వైసీపీ పాలకులు విద్యారంగ అభివృద్ధిని గాలికొదిలేశారు. కేవలం ప్రచారార్భాటాలకే పరిమితమయ్యారు. విద్యార్థులకు అందించిన కిట్‌లు నాణ్యతా లోపంతో రోజులకే మూలనపడ్డాయి. నాడు - నేడు అంటూ కాసులు దండుకుందే తప్ప పూర్తి స్థాయిలో పనులు జరిగిన దాఖలాలు లేవు. ఈక్రమంలో నిధులు లేక విద్యాలయాలు అభివృద్ధికి నోచుకోక పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో విద్యుత్‌ బిల్లులు మోత మోగడంతో అప్పట్లో కొంత వరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తిప్పలు పడి కొంత మేరకు బిల్లులు చెల్లించారు. అయినా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగక గతంలోనే ఆయా విద్యాలయాలకు విద్యుత్‌ శాఖ నుంచి నోటీసులు అందాయి. ఈవిధంగా దుర్భర పరిస్థితులలో ఉన్న పాఠ శాలలకు కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులను మేమే కడతామని అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించడంతో పాఠశాలల ప్రధానోపాఽధ్యాయులు, ఉపాధ్యాయులు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. మంత్రి లోకేష్‌ ప్రకటనతో చీరాల పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 84 స్కూళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.12 లక్షలు, వేటపాలెం మండల పరిధిలోని 54 స్కూళ్లకు పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.8 లక్షల కరెంట్‌ బిల్లులు ఉపాధ్యాయులకు భారంగా మారేవి. ఎట్టకేలకు ప్రభుత్వ నిర్ణయంతో ఊరట లభించింది.

ప్రభుత్వ నిర్ణయం ఆనందదాయకం

గతంలో విద్యుత్‌ సమస్యల కారణంగా బిల్లుల చెల్లింపుల్లో చా లా ఇబ్బందులు ప డ్డాం. ప్రస్తుతం ఇంకా రూ.50వేల బకాయి ఉన్నాం. పలుమార్లు మా సొంత జీతాల నుంచి చెల్లింపులు చేశాం. ఈక్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది.

- మెడబలిమి శేఖరరావు

పందిళ్లపల్లి ప్రధానోపాధ్యాయులు

నిర్ణయం భేష్‌

విద్యుత్‌ బిల్లులు కట్టేందుకు నానా తంటాలు పడ్డాం. ఇంకా రూ.40 వేలు వరకు బకాయి పడ్డాం. జీతాలు ఆపుకుని బిల్లులు చెల్లించాం. తాజా నిర్ణయంతో స్కూళ్లకు పూర్వ వైభవం అందుకుంటుంది. మాకు భారం తగ్గుతుంది. థాంక్యూ సీఎం.

- శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుడు

వాడరేవు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

సర్క్యులర్‌ అందాల్సి ఉంది

ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విద్యుత్‌ బిలులు చెల్లింపుల విషయం విద్యా రంగానికి ఊరటనిచ్చింది. అయితే సర్య్కూలర్‌ అందాక పూర్తి పరిశీలన అనంతరం పాఠశాలలు అమలు చేస్తాం.

- సుబ్రహ్మణ్యేశ్వరరావు, చీరాల మండల విద్యాశాఖ అధికారి

Updated Date - Mar 19 , 2025 | 11:28 PM