Share News

సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి ప్రతిపాదనలు

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:30 PM

సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అనువైన 12 సబ్‌ స్టేషన్‌లను గుర్తించి ప్రతిపాదనలు పంపినట్లు ఈఈ నల్లూరి మస్తాన్‌రావు అన్నారు. అద్దంకి డివిజన్‌ పరిధిలోని డీఈఈలు, ఏఈలు, సబ్‌ ఇంజనీర్‌లతో బుధవారం ఈఈ మస్తాన్‌రావు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్‌రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్‌ ఊర్జా సురక్ష ఏవం ఉద్దాన్‌ మహాభియాన్‌ యోజన పథకంలో భాగంగా ఫీడర్‌ సోలరైజేషన్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి వ్యవసాయ విద్యుత్‌ వినియోగం ఉన్న 11కేవీ ఫీడర్‌కు అనుసంధానించడం జరుగుతుందన్నారు.

సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి ప్రతిపాదనలు

విద్యుత్‌ శాఖ ఈఈ మస్తాన్‌రావు

అద్దంకి, మార్చి 19 (ఆంద్రజ్యోతి) : సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అనువైన 12 సబ్‌ స్టేషన్‌లను గుర్తించి ప్రతిపాదనలు పంపినట్లు ఈఈ నల్లూరి మస్తాన్‌రావు అన్నారు. అద్దంకి డివిజన్‌ పరిధిలోని డీఈఈలు, ఏఈలు, సబ్‌ ఇంజనీర్‌లతో బుధవారం ఈఈ మస్తాన్‌రావు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్‌రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్‌ ఊర్జా సురక్ష ఏవం ఉద్దాన్‌ మహాభియాన్‌ యోజన పథకంలో భాగంగా ఫీడర్‌ సోలరైజేషన్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి వ్యవసాయ విద్యుత్‌ వినియోగం ఉన్న 11కేవీ ఫీడర్‌కు అనుసంధానించడం జరుగుతుందన్నారు. అద్దంకి డివిజన్‌ పరిధిలోని ముప్పవరం, ధర్మవరం, కుంకుపాడు, శంఖవరప్పాడు, సాధునగర్‌, కొమ్మాలపాడు, వి.కొప్పెరపాడు, వల్లాపల్లి, కొమ్మినేనివారిపాలెం, ఉప్పమాగులూరు, బల్లికురవ, వెలమవారిపాలెం సబ్‌స్టేషన్‌లను ఎంపిక చేసి 20 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ప్రతిపాదనలు పంపినట్లు చె ప్పారు. సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం ఒక్కో మెగా వాట్‌కు 4.5 ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేని చోట రైతుల నుంచి కౌలుకు తీసుకోవడం జరుగుతుందన్నా రు. టెండర్‌లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

50శాతం రాయితీపై అధికలోడు

క్రమబద్ధీకరణకు అవకాశం

గృహ వివియోగానికి సంబఽంధించి అధిక లోడు ను 50 శాతం రాయితీ తో క్రమబద్ధీకరించుకునేందుకు ఏపీ ఈఆర్‌సీ అవకాశం కల్పించదని ఈఈ మస్తాన్‌రావు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలన్నారు.

ఒక కిలోవాట్‌కు 2350 రూపాయలు చెల్లించాల్సి ఉండగా, 50 శాతం రాయితీతో 1250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. 5 కిలో వాట్‌ల లోపు అయితే స్థానిక విద్యుత్‌ కార్ల్యాలయంలోని కౌంటర్‌లో, అంతకు మించితే మీ సేవా కేం ద్రాలలో చెల్లించాలని తెలిపారు. ఈ అవకాశం జూన్‌ 30వ తేదీ వరకు ఉంటుందన్నారు.అధికారులు క్షేత్ర స్థాయిలో వినియోగదారులలో మ రింత అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమవేశంలో డీఈఈలు దామోదర్‌, సురేం ద్రబాబు, ఈఆర్‌వో కార్యాలయాల ఏఏవోలు శ్రీనివాసులు, శ్రీనివాసరావు, డివిజన్‌ పరిధిలోని ఎఈలు, సబ్‌ ఇంజనీర్‌ లు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:30 PM