Share News

శరవేగంగా అభివృద్ధి పనులకు రూపకల్పన

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:25 PM

కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూపకల్పన చేసినట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, దేవదాయ శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఆయా విషయాలను డాక్టర్‌ ఉగ్ర వెల్లడించారు.

శరవేగంగా అభివృద్ధి పనులకు రూపకల్పన
మంత్రి ఆనం సమక్షంలో కనిగిరి అభివృద్దిపై ప్రణాళికా చర్చలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు

- ఏప్రిల్‌లో బయోగ్యాస్‌ కంపెనీకి భూమి పూజ

- ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూపకల్పన చేసినట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, దేవదాయ శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఆయా విషయాలను డాక్టర్‌ ఉగ్ర వెల్లడించారు. కనిగిరి నియోజక వర్గంలో నెలకొన్న దేవదాయ భూముల సమస్యలు పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. హనుమంతునిపాడు మండలంలో లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయం అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేసినట్లు తెలిపారు. వెలిగండ్ల మండల కేంద్రంలోని హైస్కూల్‌ ఆటస్థల ప్రాంగణంకై దేవాలయం భూములను కొనుగోలు చేసి ఆటస్థలానికి కేటాయించాలని కోరినట్లు తెలిపారు. కనిగిరిలోని విజయమార్తేండేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన భూములను గుర్తించటంతో పాటు శిథిలావస్థకు చేరుకున్నా ఆయా దేవాలయానికి సంబంధించిన రూముల స్థానంలో నూతనంగా నిర్మాణం చేపట్టాలని మంత్రి ఆనం దృష్టికి తీసుకువెళ్ళినట్లు డాక్టర్‌ ఉగ్ర తెలిపారు.

పీసీపల్లి మండలంలో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ఏర్పాటు విషయంపై రిలయన్స్‌ ప్రతినిధులు విద్యుత్‌శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చించినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 2 లేదా 18న బయోగ్యాస్‌ కంపెనీ నిర్మాణానికి మంత్రి లోకేష్‌ భూమి పూజ చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - Mar 19 , 2025 | 11:25 PM