Share News

చెంచుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:59 AM

రాష్ట్రంలో చెంచుల జీవితాల గురించి కాని వారి అభివృద్ధి గురించి గత పాలకులు పట్టించుకున్న పాపా న పోలేదని అందుకే వారిని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

చెంచుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

ఎర్రగొండపాలెం రూరల్‌ మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చెంచుల జీవితాల గురించి కాని వారి అభివృద్ధి గురించి గత పాలకులు పట్టించుకున్న పాపా న పోలేదని అందుకే వారిని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. బుధవారం స్థానిక డా.బిఆర్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ శ్రీశైలం వారి ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లు ఎలక్ర్టికల్‌ టూల్‌ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలల కాలంలో గిరిజను ల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నార ని అన్నారు. ఇటీవల దోర్నాల మండలంలో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చొరవతో పలు గూడేలలో సొలార్‌ విద్యుత్‌ సదుపాయం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అలాగే వారి కోసం ప్రత్యేకంగా గృహనిర్మాణాలు అమలు చేశామన్నారు. అలాగే చెంచుల ఆరోగ్య దృష్ట్యా రక్తహీనత పెంచేం దుకు రెండు వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేస్తునట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతి చెంచు నివాసాన్ని పలకరించి వారి కష్టాలను తెలుసుకున్నట్లు తెలిపారు. వారి అభివృద్ది కోసం తను శ్రీశైలం ఐటీడీఏ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. అందుకు ప్రాజెక్టు అధికారి వెంకట శివప్రసాద్‌ కూడ పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెంచు కుటుంబాలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. అలాగే రైతులకు ఎంతో ఉపయోగపడే ఎలక్ర్టికల్‌ టూల్‌ కిట్లు పంపిణి చేశారు. ఆయా కార్యక్రమాలలో ఐటీడీఏ పీవోతో పాటు ఏపివో సురేష్‌, పీహెచ్‌వో ధనుంజయ్‌, ఎస్‌వో జి నాయక్‌, ఏపీటీవో మధుసుదన్‌ రావు, జూనియర్‌ అసిస్టెంట్‌ రాజ సిబ్బంది, టీడీపీ నాయకులు చేకూరి సుబ్బారావు, షేక్‌ మస్తాన్‌వలి, చెవుల ఆంజయ్య, శ్రీశైలపతి నాయుడు, వేగినాటి శ్రీను, సత్యనారాయణ గౌడ్‌, ఎంసీహెచ్‌ మంత్రునాయక్‌, వెంగళ్‌రెడ్డి, పయ్యా వుల ప్రసాద్‌, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, బి వెంకటేశ్వర నాయక్‌, చెవుల భయన్న, మూగన్న, అచ్యూతరావు, మల్లికార్జునాచారి, కూటమి నాయకులు, చెంచు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 12:59 AM