భూ సమస్యలు పరిష్కరించేందుకే పర్యటనలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:53 AM
జిల్లాలో వెబ్‌ల్యాండ్ సమస్యలపై జేసీ లాగిన్‌కు 853 అర్జీలు ఆన్‌లైన్ కోసం ధరఖాస్తు చేశారని, మండల కేంద్రాలకు రైతులను పిలిపించి ఆన్‌లైన్ సమస్యలు పరిష్కరిస్తున్నామని జేసీ కె .గోపాలకిష్ణ తెలిపారు.

ఎర్రగొండపాలెం, మార్చి 27, ( ఆంధ్రజ్యోతి): జిల్లాలో వెబ్‌ల్యాండ్ సమస్యలపై జేసీ లాగిన్‌కు 853 అర్జీలు ఆన్‌లైన్ కోసం ధరఖాస్తు చేశారని, మండల కేంద్రాలకు రైతులను పిలిపించి ఆన్‌లైన్ సమస్యలు పరిష్కరిస్తున్నామని జేసీ కె .గోపాలకిష్ణ తెలిపారు. ఎర్రగొండపాలెం తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో భూసమస్యలు, ఆన్‌లైన్ సమస్యలపై జిల్లాలో 8500 వినతులు రైతులు అందజేశారన్నారు. వాటిలో వెబ్‌ల్యాండ్‌పై 853 అర్జీలను స్వయంగా రైతులతో విచారించి పరిష్కరిస్తామన్నారు. త్రిపురాంతకం మండలంలో 25 వెబ్‌ల్యాండ్ సమస్యలు పరిష్కరించామన్నారు. ఎర్రగొండపాలెం మండలంలో ఉన్న అర్జీలను ఈ రోజు పరిశీలించామన్నారు. దేవదాయభూములు ఏ ఆలయంపై ఆర్వోఆర్ ఉంటే ఆపేరు మీదనే ఆన్‌లైన్ చేయాలన్నారు. జిల్లాలో 38 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే జరుగుతుం దన్నారు. ఏప్రిల్ 26 నాటికి డ్రాప్టు ఆర్‌వోఆర్ పూర్తవుతుంద న్నారు. మే చివరి వారానికి రైతులకు భూములకు ఆన్‌లైన్ పూర్తిచేస్తా మన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం సబ్‌కలెక్టర్ వెంకట త్రివినాగ్, తహసీల్దారు శైలేంద్రకుమార్, డిప్యూటీ తహసీల్దారు మల్లికార్జుననాయుడు పాల్గొన్నారు.
రెగ్యులర్ తహసీల్దార్లను నియమించండి
ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాలలో ఇన్‌చార్జ్ తహసీల్దార్లతో పనులు జరగక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గురువారం సాయత్రం ఎర్రగొండపాలెం తహసీల్దారు కార్యాలయం వద్ద జేసీగోపాలకృష్ణను కలసి విజ్ఞప్తి చేశారు. ఇన్‌చార్జ్ తహసీల్దారు కార్యాలయంలో ఎప్పుడు ఉంటారో తెలియడం లేదన్నారు దీనిపై ఆయన స్పందిస్తూ,. త్వరలో రెగ్యులర్ తహసీల్లార్లను నియమిస్తామన్నారు.