Do justice ఢిల్లీరావు కుటుంబానికి న్యాయం చేయండి
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:54 PM
Do justice ఉద్దానం ప్రాంతానికి చెందిన తెప్పల ఢిల్లీరావు విద్యుత్ తీగలు తగిలి మృతి చెంది మూడు నెలలు కావస్తున్నా.. ఎలా మృతి చెందారో ఇప్పటి వరకు నిగ్గు తేల్చలేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

మాజీ మంత్రి అప్పలరాజు
పలాస, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాంతానికి చెందిన తెప్పల ఢిల్లీరావు విద్యుత్ తీగలు తగిలి మృతి చెంది మూడు నెలలు కావస్తున్నా.. ఎలా మృతి చెందారో ఇప్పటి వరకు నిగ్గు తేల్చలేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మృతుడి భార్య కమలమ్మతో కలిసి ఆందోళనకు దిగారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విష యం తెలుసు కున్న డీఎస్పీ వి.వెంకట అప్పారావు అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. దౌర్జన్యం చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడం తగదని, మృతి వ్యవహారంపై తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తు నకు కొంత సమయం పడుతుందని, దీన్ని రాజకీయం చేయడం తగదని హెచ్చరించారు. దీంతో వారిద్దరి మధ్వ వాగ్వాదం జరిగింది. అనంతరం స్టేషన్‌లో ఆందోళనకారులతో చర్చించారు. సంయమనం పాటించాలని, నిజా లు నిగ్గుతేల్చి ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని డీఎస్పీ చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు.