Share News

రంజాన్‌ తోఫా పంపిణీ

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:48 PM

పవిత్ర రంజాన్‌ పర్వదినాన పేద ముస్లింలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ రంజాన్‌ తోఫాను పంపిణీ చేశారు.

 రంజాన్‌ తోఫా పంపిణీ
రంజాన్‌ తోఫా పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

అరసవల్లి, మార్చి 31(ఆంధ్ర జ్యోతి): పవిత్ర రంజాన్‌ పర్వదినాన పేద ముస్లింలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ రంజాన్‌ తోఫాను పంపిణీ చేశారు. నగరంలోని విశాఖ-ఎ కాలనీలో గల తన కార్యా లయంలో 250 మందికి సోమవారం రంజాన్‌ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఐదు కిలోల గోధుమ పిండి, రెండు కిలోల పంచదార, అర కిలోల సేమ్యా, ఖర్జూరం పావు కిలో, నెయ్యి పావు కిలో గల కిట్లను పంపిణీ చేశారు. ప్రేమ, సోదర భావాలకు నిలయమైన రంజాన్‌ పండుగను పేద ముస్లింలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, నగర మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్‌ నిజాముద్దీన్‌, ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు కమిటీ పూర్వపు సభ్యులు బహదూర్‌ భాషా, ఎండీ రఫీ, షేక్‌ సలీం, షేక్‌ హుస్సేన్‌, ఎండీ జహంగీర్‌, షేక్‌ రిహాన్‌, షేక్‌ కమల్‌, ఆయేషా, షకీరా, జాస్మిన్‌, షేక్‌ పర్వీన్‌, సన్ని, షేక్‌ రేష్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ను పూర్వ విద్యార్థులు, నగర కమిషనర్‌ ప్రసాదరావుతో కలిసి సందర్శించారు. తిలక్‌ హాల్‌ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్‌ఎం దేవదత్తానంద్‌, నాయకులు పాండ్రంకి.శంకర్‌, జామి భీమశంకరరావు, కెల్ల కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:48 PM