Share News

ఆదిత్యాలయ భద్రతపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:45 PM

జలుమూరు మండలంలోని వివిధ ఆలయాలలోని గోడలపై అన్యమత ప్రచారానికి సంబంధించిన రాసిన రాతలు జిల్లాలో కలకలం సృష్టించాయి.

ఆదిత్యాలయ భద్రతపై ప్రత్యేక దృష్టి
ఇచ్ఛాపురం: రామాలయంలో సీసీ కెమెరా ఏర్పాటు పరిశీలిస్తున్న ఎస్‌ఐ

  • సీసీ కెమెరాల నిర్వహణపై పోలీసుల ఆరా

అరసవల్లి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): జలుమూరు మండలంలోని వివిధ ఆలయాలలోని గోడలపై అన్యమత ప్రచారానికి సంబంధించిన రాసిన రాతలు జిల్లాలో కలకలం సృష్టించాయి. జిల్లాలోని ఆలయాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాకే తలమానికమైన, ప్రఖ్యాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు పనిచేస్తున్న తీరును సోమవారం రాత్రి పోలీసులు పరిశీలించారు. ఆలయా నికి సంబంధించిన మొత్తం 32 కెమెరాలు ఉండగా ఎన్ని పనిచేస్తున్నాయి.. పనిచేయని కెమెరాలు ఎన్ని అన్న వివరాలు సేకరించారు. మొత్తం 32 సీసీ కెమెరాలకు గాను నాలుగు కెమెరాలు పనిచేయడం లేదు. ఆదిత్యాలయ సీసీ కెమెరాలకు సంబంధించి ఐపీ అడ్రస్‌ను పోలీసులు ఆలయ సిబ్బంది ద్వా రా సేకరించారు. ఈ అడ్రస్‌ ద్వారా ఆలయ అధికారులు యా క్సిస్‌ ఇస్తే పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నుంచి కూడా ఆలయంలో జరుగుతున్న ఘటనల వివరాలను తెలుసుకునే వీలు ఉం టుంది. అలాగే భద్రతను మరింత పటిష్టం చేయాలని, ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందిని కూడా పూర్తిగా వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. పనిచేయని కెమెరాలను పునరుద్ధరించి ఆలయ భద్రతపై పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

సీసీ కెమెరాల ఏర్పాటు

ఇచ్ఛాపురం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణలో భాగంగా మండలంలోని అన్ని ఆలయాలు, చర్చిల్లో విడతల వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఈదుపురం గ్రామంలో రెండు చర్చిలు, రామాలయంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు. డొంకూరు, తులసిగాం గ్రామాల్లో మరో రెండు రోజుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:45 PM