విద్యా రంగాన్ని కాపాడుకుందాం
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:43 PM
ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ద్వారానే సమాజం లో అందరికీ విద్యా అందుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు.

గుజరాతీపేట, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ద్వారానే సమాజం లో అందరికీ విద్యా అందుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో సోమవారం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యూటీఎఫ్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణల వల్ల విద్యార్థుల సంఖ్యను పెంచలేకపోయామన్నారు. ఈ సంస్కరణలు గడిచిన ఐదేళ్లలో దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదలి వెళ్లిపోయారన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు కూడా ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉపాధ్యాయులకు నమ్మకం కలిగించే పని ఏమి చేయడంలేదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ 12వ ిపీఆర్సీ నియమించలేదన్నారు. తక్షణం గత పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్, ప్రతినిధులు వి.లక్ష్మి, కె.విజయ గౌరి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, వివిధ జిల్లాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.