కనీస పెన్షన్ రూ.తొమ్మిది వేలు ఇవ్వండి
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:53 PM
కనీస పెన్షన్ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలని జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయ కులు డిమాండ్‌చేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని పీఎఫ్ కార్యాలయం వద్ద అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు దొంతం పార్వతీశం, మణికొండ ఆదినారా య ణ ఆధ్వర్యంలో నిరసనప్రదర్శన నిర్వహించారు.

అరసవల్లి/గుజరాతీపేట, మార్చి 18(ఆంద్రజ్యోతి): కనీస పెన్షన్ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలని జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయ కులు డిమాండ్‌చేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని పీఎఫ్ కార్యాలయం వద్ద అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు దొంతం పార్వతీశం, మణికొండ ఆదినారా య ణ ఆధ్వర్యంలో నిరసనప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈపీఎస్ పెన్షనర్లకు ప్రభుత్వం నిత్యావసరాలను సరఫరా చేయాలని, ప్రయాణ ఖర్చుల్లో రాయితీ, ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పీఎఫ్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, పి.వాసుదేవరావు, బి.శివాజీ పాల్గొన్నారు.