రంజాన్ సన్మార్గానికి మారు పేరు: కలెక్టర్
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:35 PM
పవిత్ర రం జాన్ మాసం సన్మార్గానికి మారుపేరని కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్ తెలిపారు.

శ్రీకాకుళం కలెక్టరేట్/శ్రీకాకుళం కల్చరల్, మార్చి 28(ఆంధ్రజ్యోతి): పవిత్ర రం జాన్ మాసం సన్మార్గానికి మారుపేరని కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఇందిరావిజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో మైనార్టీ సం క్షేమశాఖ ద్వారా రంజాన్ పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్య క్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర రావు, ఆర్డీవో సాయి ప్రత్యూష, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి జాన్ సుధాకర్, డీ ఎస్‌ఓ సూర్యప్రకాష్, చెన్నకేశవరావు పాల్గొన్నారు.