Share News

స్మార్ట్‌ మీటర్లు ఉపసంహ రించుకోవాలి

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:24 PM

స్మార్ట్‌ మీటర్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిం దరావు డిమాండ్‌ చేశారు. స్థానిక జీటీ రోడ్డులో గల ఏపీఈపీడీసీ ఎల్‌ కార్యాలయం ఎదుట పెంచిన విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, నాయకులు భవిరి కృష్ణ మూర్తి, కె.నాగమణి,ఆదినారాయణమూర్తి, వెలమల రమణ, తూతిక ప్రవీణ, లక్ష్మి, లలిత పాల్గొన్నారు.

   స్మార్ట్‌ మీటర్లు ఉపసంహ రించుకోవాలి
అరసవల్లి: శ్రీకాకుళంలో నిరసన తెలుపుతున్న నాయకులు:

అరసవల్లి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ మీటర్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిం దరావు డిమాండ్‌ చేశారు. స్థానిక జీటీ రోడ్డులో గల ఏపీఈపీడీసీ ఎల్‌ కార్యాలయం ఎదుట పెంచిన విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, నాయకులు భవిరి కృష్ణ మూర్తి, కె.నాగమణి,ఆదినారాయణమూర్తి, వెలమల రమణ, తూతిక ప్రవీణ, లక్ష్మి, లలిత పాల్గొన్నారు.

ఫ ఎచ్చెర్ల, మార్చి 28(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీలు రద్దుచేయాలని సీపీఎం నాయకులు కోరారు. శుక్రవారం ఎచ్చెర్లలోని సబ్‌స్టేషన్‌ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా సీపీఎం నాయకుడు పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ట్రూఅప్‌ చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్‌ మీటర్ల ను బిగించడం నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.బంగార్రాజు, జి.శ్రీనివాసరావు, ఎం.సురేష్‌, కె.గోవిందకుమార్‌, ఎల్‌.రాము, ఎన్‌వీ రమణ, ఎల్‌.సీతా రామ్‌, జె.చిట్టప్పడు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:24 PM