ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:52 PM
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే నమస్తే ఎచ్చెర్ల .. మన ఊరికే - మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) తెలిపారు.

రణస్థలం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి ): ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే నమస్తే ఎచ్చెర్ల .. మన ఊరికే - మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నడుకు దిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) తెలిపారు. శుక్రవారం కోష్ట పంచాయతీలో ఆయన పర్యటించారు. రూ.25 లక్షలతో పూర్తి చేసిన వివిధ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యే చొరవ చూపుతాన ని హామీ ఇచ్చారు. కోష్టలో లోవోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని పలువురు తెలియజే శారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. దువ్వానిపే టను అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు అప్పడదొర, పిషిని జగన్నాథనాయుడు, పిషిని లక్ష్మి, లంక శ్యామలరావు, గొర్లె లక్ష్మ ణరావు, వడ్డాది శ్రీను, దన్నాన మహేష్, పి.అసిరినాయుడు, తదితరులు పాల్గొన్నారు.