సుందర నగరమే లక్ష్యం
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:13 AM
శ్రీకాకుళం నగరాని సమస్యలు లేకుండా సుందర నగరంగా తీర్చిదిద్దడేమ లక్ష్యమంతి ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
అరసవల్లి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరాని సమస్యలు లేకుండా సుందర నగరంగా తీర్చిదిద్దడేమ లక్ష్యమంతి ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నగర పరిధిలోని సత్యసాయి నగర్, షిర్డీసాయి నగర్, వరం కాలనీల్లో నగర కమిషనర్ ప్రసాదరావుతో కలిసి ఆయన పర్యటించారు. వీధివీధి కలియతిరిగి సమస్యలు తెలుసుకున్నారు. వీధుల్లో మురుగునీరు కాలువలు కావాలని కాలనీ వాసులు కోరగా, మిర్తిబట్టి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కమిషనర్‌ను కోరారు. కార్యక్రమంలో హెల్త్ అధికారి, ఇంజనీరింగ్ సిబ్బంది, చాపురం, ఆదివారంపేట సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు రాజారావు, పీఎంజే బాబు, కాలనీ వాసులు ధర్మారావు, జగ న్నాథరావు, కృష్ణమూర్తి, అల్లు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.