ఆదిత్యునికి రూ.లక్ష విరాళం
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:11 AM
ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం నగరానికి చెందిన వలివేటి శ్రీదేవి ఆదివారం దర్శించుకున్నారు.

అరసవల్లి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం నగరానికి చెందిన వలివేటి శ్రీదేవి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం వారి అన్నయ్య జయ రామారావు జ్ఞాపకార్థం స్వామి వారి శాశ్వత అన్నదాన పథకానికి రూ.1,00,001 ఆలయ ఈవో వై.భద్రాజీకి విరాళంగా అందజేశారు. స్వామివారికి ఆదివారం ఒక్కరోజు రూ.2,89,001 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.1,12,600, విరాళాలుగా రూ.60,521, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,15,880 లభించాయి. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబసమేతంగా అలాగే స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ప్రధాన అర్చకులు స్వాగతం పలుకగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో భద్రాజీ వారికి అందజేశారు.