Share News

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:40 PM

విద్యార్థులు విద్య ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
విద్యార్థినికి ఉపకార వేతనం అందజేస్తున్న ఎమ్మెల్యే వరద

ప్రొద్దుటూరు టౌన్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు విద్య ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. శనివారం కేసీ పుల్లయ్య ఫౌండేషన్‌ ఆధ్వర ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 500 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయా లని కోరారు. కేసీ పుల్లయ్య తనకు మంచి మిత్రుడని, ఆయన వారస త్వాన్ని ఆయన కుమారులు కొనసాగించడం అభినందనీయమన్నారు. టీటీడీ మాజీ సభ్యుడు మారుతీప్రసాద్‌, తెలంగాణా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె.సుజాతలు మాట్లాడుతూ ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు కేసీపీ పౌండేషన్‌ ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయమన్నారు. కేసీపీ పౌండేషన్‌ చైర్మన్‌ కె.అనిల్‌కుమార్‌, కృష్ణవేణమ్మ, సుశీల్‌కుమార్‌, చల్లా సుధ, వంకదార వీరభద్రయ్య, రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:40 PM

News Hub