Share News

‘టీడీపీ కార్యకర్తల సేవలు ఎన్నటికీ మరువను’

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:40 PM

టికెట్టు రావడంతో పాటు 6వ సారి ఎమ్మెల్యే కావడానికి టీడీపీ కా ర్యకర్తలు చేసిన కృషిని ఎన్నటికి మ రువనని ఎల్లప్పుడు వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి పేర్కొన్నారు.

  ‘టీడీపీ కార్యకర్తల సేవలు ఎన్నటికీ మరువను’
కార్యకర్తకు సభ్యత్వ కార్డు అందజేస్తున్న ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు, మార్చి 21(ఆంధ్ర జ్యో తి): టికెట్టు రావడంతో పాటు 6వ సారి ఎమ్మెల్యే కావడానికి టీడీపీ కా ర్యకర్తలు చేసిన కృషిని ఎన్నటికి మ రువనని ఎల్లప్పుడు వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్ధానిక అభ్యాస్‌ జూనియర్‌కళాశాలలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించి టీడీపీ కార్యకర్తలకు సభ్యత్వకార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్య్డే మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రొద్దుటూరులో పాల న గాడి తప్పిన మాట వాస్తవమన్నారు. లంచగొండి అఽధికారుల వల్ల ప్రభుత్వ పాలన సక్రమంగా సాగటం లేదన్నారు. గత వైసీపీలో ఉన్నవారే ఇప్పుడూ ఉన్నారన్నారు. మూడు నాలుగునెలల్లో మంచి పరిపాలన సాగిం చేందుకు కృషి చేస్తానన్నారు. అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే వారిని అణచివేయడంలో రాత్రి పగలని తేడాలేకుండా పనిచేస్తానన్నారు. ప్రతి టీడీపీ కార్యకర్త నిర్బయంగా తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చ న్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ మాజీ మున్సిపల్‌ చైర్మనలు ఆసం రఘురామిరెడ్డి, వీఎస్‌ ముక్తియార్‌, పట్టణ టీడీ పీ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌ రెడ్డి వాల్మీకి బోయకార్పొరేషన స్టేట్‌ డైరె క్టర్‌ నల్లబోతుల నాగరాజు, టౌనబ్యాంకు చైర్మన బొగ్గుల సుబ్బారెడ్డి, కొత్తపల్లె సర్పంచ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ బోడెల బాబు ల్‌రెడ్డి, నాగమునిరెడ్డి బీసీ నాయకులు బొర్రా రామాంజనేయులు రిటైర్డ్‌ ఎస్‌ఐ శంకర్‌ పగిడాల దస్తగిరి, మున్సిపల్‌ కౌన్సిల్లర్లు, మాజీ కౌన్సిల్లర్లు రాజుపాళెం ప్రొద్దుటూరు మండల కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:40 PM