Share News

సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:20 AM

నంద్యాల జిల్లాలో ఎనసీడీ సీడీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని రాషీ్ట్రయ బాలసురక్ష జిల్లా నోడల్‌ అధికారి కాంతారావునాయక్‌ ఆదేశించారు.

  సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

చాగలమర్రి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో ఎనసీడీ సీడీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని రాషీ్ట్రయ బాలసురక్ష జిల్లా నోడల్‌ అధికారి కాంతారావునాయక్‌ ఆదేశించారు. బుధవారం చాగలమర్రి గ్రామంలో ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. సర్వేకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అంగనవాడీ కేంద్రాలల్లో పిల్లల పరీక్షలను, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఆల్‌బెండజోల్‌, ఐరన గుళికల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మూడవ సచివాలయంలో జరుగుతున్న ఎఫ్‌డీపీ కార్యక్రమాన్ని, 1 నుంచి 5వ సచివాలయాలను సందర్శించి ఎనసీడీ సీడీ సర్వేల గురించి వైద్య సిబ్బందికి సూచనలు, సలహాలు తెలియజేశారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికి బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 50 శాతం సర్వే పూర్తయిందని, ఈనెల చివరి నాటికి వంద శాతం పూర్తి చేస్తామని అన్నారు. క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ అయితే వైద్య చికిత్సలు అందిస్తామని తెలియజేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు ఇమ్రాన, అంజలి, సీహెచవో రమణమ్మ, సూపర్‌వైజర్‌ రామలింగారెడ్డి, ఏఎనఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:20 AM