LSG vs MI Prediction: పంత్ వర్సెస్ పాండ్యా.. లెక్క సరిచేస్తారా..
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:25 PM
Indian Premier League: ఐపీఎల్ కొత్త ఎడిషన్‌లో మరో సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. నువ్వా నేనా అంటూ కత్తులు దూసే లక్నో సూపర్ జియాంట్స్, ముంబై ఇండియన్స్ మధ్య సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌కు అంతా రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి పోరులో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

క్యాష్ రిచ్ లీగ్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. ఈసారి తలపడబోయేది లక్నో సూపర్ జియాంట్స్-ముంబై ఇండియన్స్. ఈ రెండు టీమ్స్ మధ్య బిగ్ రైవల్రీ ఉంది. ఎంతటి జట్టునైనా తొక్కిపారేసే ముంబై.. లక్నో ఎదురొస్తే మాత్రం సాగిలపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో విజయంతో గాడిన పడాలని అనుకుంటున్న ఎల్‌ఎస్‌జీ.. విన్నింగ్ మూమెంటమ్‌ను కంటిన్యూ చేయాలనుకుంటున్న ఎంఐ.. రెండూ ఆఖరి వరకు ఢీ అంటే ఢీ అంటూ పోరాడటం ఖాయం. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి. ఎవరికి గెలిచే చాన్సులు దండిగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బలాలు
లక్నో: ఈ టీమ్‌కు బ్యాటింగే ప్రధాన బలం. నికోలస్ పూరన్, ఆయుష్ బదోని మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా పూరన్ ఫస్ట్ మ్యాచ్ నుంచి దంచుతున్నాడు. మార్క్రమ్ కూడా టచ్‌లో కనిపిస్తున్నాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ కూడా ధనాధన్ షాట్లతో రెచ్చిపోతున్నాడు. బౌలింగ్‌లో దిగ్వేష్ రాణిస్తుండటం బిగ్ ప్లస్. లార్డ్ శార్దూల్ తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను మార్చేయగలడు.
ముంబై: ఈ టీమ్‌కూ బ్యాటర్లే మెయిన్ స్ట్రెంగ్త్. ర్యాన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. తిలక్ వర్మ కూడా టచ్‌లో కనిపిస్తున్నాడు. బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాతో పాటు దీపక్ చాహర్ రాణిస్తున్నాడు. నయా సంచలనం అశ్వనీ కుమార్ మీద గట్టి అంచనాలు ఉన్నాయి.
బలహీనతలు
లక్నో: కెప్టెన్ పంత్ బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. డబుల్ డిజిట్‌ను చేరుకునేందుకూ శ్రమిస్తున్నాడు. మిల్లర్ టచ్‌లో కనిపిస్తున్నా ఊహించినంతగా స్కోర్ చేయడం లేదు. బౌలింగ్‌లో శార్దూల్ ఫెయిలైతే గనుక కావాల్సిన సమయంలో బ్రేక్‌త్రూలు అందించేవారు లేరు. బిష్ణోయ్ వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకోవడం బిగ్ మైనస్‌గా మారింది.
ముంబై: రోహిత్ శర్మ ఫామ్ ఈ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. విల్ జాక్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. హార్దిక్ బ్యాట్ నుంచి కూడా అంతగా పరుగులు రావట్లేదు. బౌలింగ్‌లో బౌల్ట్ రన్స్ కట్టడి చేస్తున్నా పెద్దగా వికెట్లు తీయట్లేదు. అందుకే పుతుర్, అశ్వనీ లాంటి యంగ్ బౌలర్లపై భారం వేస్తోంది ఎంఐ. ఒకవేళ వాళ్లు ప్రెజర్‌కు లోనై వికెట్లు తీయకపోయినా, పరుగులు బాగా సమర్పించుకున్నా టీమ్‌కు కష్టాలు తప్పవు.
హెడ్ టు హెడ్
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 6 మ్యాచులు జరగ్గా.. అందులో ఐదింట లక్నోనే గెలిచింది. ఒక్కదాంట్లో మాత్రమే ముంబై నెగ్గింది. గత ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచుల్లోనూ లక్నో సూపర్ జియాంట్స్ గెలిచింది.
విన్నింగ్ ప్రిడిక్షన్
హెడ్ టు హెడ్ రికార్డులు, హోమ్ గ్రౌండ్ లక్నోకు అడ్వాంటేజ్‌గా ఉన్నాయి. అయితే బిగ్ స్టార్లతో నిండిన ముంబై ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను చేతుల్లో నుంచి లాక్కెళ్లగలదు. ఆ టీమ్ బ్యాటింగ్ పవర్ చూస్తుంటే.. ఇవాళ్టి ఫైట్‌లో విజయం పక్కా ముంబైదే.
ఇవీ చదవండి:
ప్లేయింగ్ 11తోనే బిగిస్తున్నారు
రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్
ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి