Share News

Bird Flu Death in AP: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్‌తో చిన్నారి చనిపోయిన ఘటన

ABN , Publish Date - Apr 02 , 2025 | 10:00 AM

Bird Flu Death: తెలిసీ తెలీక చిన్న చికెన్ ముక్క నోట్లో పెట్టుకున్నందుకు అభం శుభం తెలీని ఓ చిన్నారి మృత్యువాత పడింది.

Bird Flu Death in AP: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్‌తో చిన్నారి చనిపోయిన ఘటన
chicken

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ (Bird Flu) వైరస్‌తో ఒక చిన్నారి చనిపోయింది. పల్నాడు జిల్లా, నరసరావుపేటలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల బాలిక పచ్చి కోడి మాంసం తినడం వల్ల అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రంలో ఆందోళన కలిగించే అయినప్పటికీ అధికారులు అంతగా భయపడాల్సిన పని లేదంటున్నారు. మార్చి 4న బాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా, తల్లిదండ్రులు ఆమెను మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మార్చి 16న ఆమె మృతి చెందింది. అయితే, తాజాగా వచ్చిన బాలిక స్వాబ్ శాంపిల్స్‌ ఆమెకు H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ చేశాయి. కోడిని కోస్తున్నప్పుడు బాలిక ఒక చిన్న చికెన్ ముక్క నోట్లో పెట్టుకుంది. ఆ మాంసం తిన్న కొద్దిసేపటికే చిన్నారికి అనారోగ్య లక్షణాలు కనిపించడం విశేషం. బర్డ్ ఫ్లూ వైరస్ మానవులకు సంక్రమించే సామర్థ్యాన్ని ఈ ఘటన సూచిస్తోంది.


ఇవి కూడా చదవండి..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Updated Date - Apr 02 , 2025 | 10:00 AM