IPL 2025: బ్రిటిష్ అమ్మాయితో యువ క్రికెటర్ సంసారం.. ఆ ఫోటో అర్థం అదేనా
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:21 PM
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ బ్రిటిష్ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నారనే ఆరోపణలు నిజమేనా. తాజాగా జైశ్వాల్ ఇన్‌స్టా ఖాతాలో ఫోటో దేనికి సంకేతం. ఈ ఫోటోకు స్పెషల్ మూమెంట్స్ అంటూ క్యాప్షన్ ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చంతా జైశ్వాల్ ఫోటోపైనే. ఇంగ్లాండ్ దేశస్తురాలు మాడ్డీ హామిల్టన్‌తో కలిసి దిగిన సెల్ఫీని జైశ్వాల్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఈ పోస్టు చేయగానే హామిల్టన్‌తో జైశ్వాల్ డేటింగ్ పుకార్లకు మరింత బలం చేకూర్చినట్లైంది. జైశ్వాల్ మాడ్డీ హామిల్టన్‌తో పాటు ఆమె సోదరుడు హెన్రీ హామిల్టన్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేశాడు. ఈ ఫోటోలో ముగ్గురూ ఆనందంగా ఉన్న దృశ్యం కనిపిస్తోంది. ఈ ఫోటోకు స్పెషల్ మూమెంట్స్ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో మాడ్డీ తన సోదరుడితో కలిసి సాధారణ దుస్తుల్లో ఉండగా జైశ్వాల్ క్రికెట్ జెర్సీలో కనిపించాడు. ఈ ఫోటో ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో తీసిన ఫోటోగా ఉంది. ఈ ఫోటోతో యశస్వి జైశ్వాల్ మాడ్డీతో డేటింగ్‌లో ఉన్నారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది.
ఎవరీ మాడ్డీ హామిల్టన్
బ్రిటిష్ జాతీయురాలైన మాడ్డీ గురించి పూర్తి వివరాలు అందుబాటులో లేకపోయినప్పటికీ ఆమె ఒక స్టూడెంట్‌గా తెలుస్తోంది. గత కొంతకాలంగా యశస్వి జైశ్వాల్ మ్యాచ్‌లు ఆడే క్రీడా మైదానాల్లో ఆమె కనిపిస్తోంది. 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరిస్‌లో ఆమె భారత జెర్సీ ధరించి జైశ్వాల్‌ను సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించింది. అప్పటినుంచి వీరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపించాయి. వీటిపై అధికారికంగా ఎవరూ స్పందించపోయినప్పటికీ తాజా ఫోటోతో ఈ పుకార్లు నిజమేనన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయి. యశస్వి జైశ్వాల్, మాడ్డీ డేటింగ్‌లో ఉన్నారనే విషయాన్ని అఫీషియల్‌గా ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియా పోస్టులు వీరి మధ్య ఏదో బంధం ఉందనే అనుమానాలకు ఆజ్యం పోసింది. అలాగే మాడ్డీ సోదరుడు హెన్రీ తన సోషల్ మీడియా ఖాతాల్లో యశస్వి జైశ్వాల్‌తో కలిసి ఉన్న ఫన్నీ వీడియోలను పోస్టు చేయడం ద్వారా వీరి మధ్య సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తోంది. తాజాగా ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫోటోతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా అనే అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఇటీవల మ్యాచ్‌లలో
ఐపీఎల్ 18వ సీజన్‌లో రాజస్థన్ తరపున ఆడుతున్న యశస్వి జైశ్వాల్ ఈ సీజన్‌లో ఫామ్‌లో కనిపించలేదు. మూడు మ్యాచుల్లో అతడి స్కోర్ 15, 7, 22 గా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఫోటో బయటకు రావడంపై అతడి ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఫోటోను చూసి జైశ్వాల్ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన క్షణమని భావిస్తుండగా కొందరు మాత్రం ఇలాంటి సంఘటనలు అతడి ఫామ్‌పై ప్రభావం చూపిస్తుందేమోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Axis Power Deal: జగన్ బాటలోనే చంద్రబాబు
YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ
Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here