Share News

Diabetes Safety Tips: షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగవచ్చా.. డాక్టర్ల సలహా ఇదే..

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:38 PM

Coconut Water For Diabetics: శరీరంలోని అలసట, నీరసం తక్షణమే తగ్గించి ఎనర్జిటిక్‌గా మార్చే సహజ పానీయాల్లో కొబ్బరి నీళ్లది ముందు వరస. అయితే, రుచిలో కాస్తంత తియ్యగా ఉండే కొబ్బరి నీళ్లను తాగాలా.. వద్దా.. అనే సందేహం చాలా మంది డయాబెటిస్ బాధితులకు ఉంటుంది. ఇంతకీ, దీని గురించి డాక్టర్లు ఏమని అంటున్నారు..

Diabetes Safety Tips: షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగవచ్చా.. డాక్టర్ల సలహా ఇదే..
Is Coconut Water Safe For Diabetics

Coconut Water For Diabetics: ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో డయాబెటిస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. అసలే ఈ సమస్యను ఒకసారి వస్తే వదిలించుకోలేరు. నియంత్రణ తప్ప మరో మార్గం ఉండదు. ఇక ఎండాకాలంలో ఆరోగ్యవంతుల కంటే షుగర్ పేషెంట్లకు డీహైడ్రేషన్ ముప్పు అధికంగా ఉంటుంది. కేవలం నీళ్లు తాగినా తప్పే. అలాగని పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ కూడా తీసుకోకూడదు. ఇలాంటప్పుడు సహజ పానీయమైన కొబ్బరి నీళ్లు తాగాలా.. వద్దా.. అనే డౌట్ రావడం సర్వసాధారణం. ఎందుకంటే, కొబ్బరి నీళ్లు రుచిలో కాస్త తియ్యగా ఉంటాయి. అందుకే బ్లడ్ షుగర్ లెవల్ పెరుగుతుందేమోననే భయం ఉంటుంది. ఇంతకీ, షుగర్ పేషెంట్లకు కొబ్బరి నీళ్లు మంచి చేస్తాయా.. హాని కలిగిస్తాయా.. వైద్యులు ఏం సూచిస్తున్నారు..


ఒక కప్పు కొబ్బరి నీళ్లలో ఏమేం పోషకాలు ఉంటాయి ?

  • చక్కెర - 6 గ్రాములు

  • సోడియం - 252 మిల్లీగ్రాములు

  • పొటాషియం - 600 మిల్లీగ్రాములు

  • ఫైబర్ - 2.6 గ్రాములు

  • ప్రోటీన్ - 1.7 గ్రా

  • విటమిన్ సి - 5.8 మిల్లీగ్రాములు

  • మెగ్నీషియం - 60 మిల్లీగ్రాములు

  • కొవ్వు - 0.5 గ్రాములు

  • కార్బోహైడ్రేట్లు - 9 గ్రాములు

  • ఐరన్ - 0.7 మిల్లీగ్రాములు


మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా?

పోషకాహార నిపుణురాల ప్రకారం కొబ్బరి నీటిని తాగవచ్చు. కానీ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు 200 ml కొబ్బరి నీళ్లలో 40-50 కేలరీలు, 10 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఒక కప్పు టీ/కాఫీలో కలిపే పాలకు పాలకు సమానమైన కార్బోహైడ్రేట్లు కొబ్బరి నీళ్లలో ఉంటాయి . అందుకే అధిక కార్బోహైడ్రేట్లతో నిండి ఉన్న ఈ నీళ్లను మంచి ప్రోటీన్ లేదా కొవ్వు అధికంగా ఉండే ఆహారంతో కలిపి తినాలి. వేరుశెనగ, బాదం లేదా కాల్చిన శనగలతో తినవచ్చు. రక్తంలో చక్కెరల ఆకస్మిక హెచ్చుతగ్గులను నివారించడానికి ఈ ఆహారాలతో పాటు తినాలి.


కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • షుగర్ పేషెంట్లకు కొబ్బరి నీళ్లు సహజ అమృతంలాంటివి. ఇవి తాగితే సులభంగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కడుపు నిండిన భావన కలిగించి శరీరాన్ని తేలికపరుస్తాయి. అంతేకాకుండా, కొబ్బరి నీళ్లలో జీర్ణక్రియకు సహాయపడే బయోయాక్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి . కాబట్టి, రోజుకు కనీసం 3-4 సార్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎక్స్ ట్రా వెయిట్ తగ్గించుకోవచ్చు.

  • కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ. అందుకే క్రీడాకారులు తక్షణ శక్తి కోసం ఈ సహజ పానీయాన్నే తాగుతారు. కాయగా ఉన్నప్పుడు తీసిన కొబ్బరి నీటిలోనే అధిక మొత్తంలో, పొటాషియం, సోడియం ఉంటాయి. మార్కెట్లో దొరికే ఏ ఇతర పానీయాలు కొబ్బరి నీళ్లకు సాటి రాలేవు.


  • కొబ్బరి నీళ్ళు బయోయాక్టివ్ కాంపౌడ్స్, అధిక మొత్తంలో ఫైబర్‌ ఉంటాయి కాబట్టి ఇది జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా అద్భుతంగా సహాయపడుతుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు లేదా అసిడిటీ వచ్చినపుడు, గ్యాస్ సమస్యలు తగ్గాలంటే ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగండి.

  • మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. తాగిన వెంటనే రిఫ్రెష్ ఫీలింగ్ కలిగించే కొబ్బరి నీళ్లు కొంచెం తీపి, వగరు కలగలసిన రుచితో ఉంటాయి. మళ్లీ మళ్లీ తాగాలనిపించేలా చేస్తాయి.

  • కొబ్బరి నీళ్లు హ్యాంగోవర్ నివారణగా కూడా పనికొస్తాయి. కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆల్కహాల్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను పెంచి వికారం, తలనొప్పిని నివారిస్తుంది.


Read Also: walking formula: ఈజీగా బరువు తగ్గాలనుందా.. 5-4-5 వాకింగ్ ఫార్ములా ట్రై చేయండి..

Glowing Skin Tips: ఫేస్ వాష్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే.. ఈ పద్ధతులే సరైనవి..

Curd after lunch: ప్రతిరోజూ భోజనం తర్వాత పెరుగు తింటే..

Updated Date - Apr 05 , 2025 | 01:40 PM