Share News

జలం.. ఒడిసిపట్టు!

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:51 AM

భూగర్భ జల సంపద పెంచడానికి ఉపాధి హామీ పథకంలో పలు కార్యక్రమాలను నిర్వ హిస్తున్నారు. ఈ పథకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయడంతో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పలు కార్యక్రమాలను డ్వామా నిర్వహిస్తోంది.

జలం.. ఒడిసిపట్టు!

ఉపాఽధి నిధులు రూ.60.36 కోట్లతో పండ్ల తోటల్లో పనులు

సరిహద్దు కందకాలు పనులకు రూ.27.86 కోట్లు.. పంట కుంటలకు రూ. 32.50 కోట్లు

భూగర్భ జలాల పెంపునకు దోహదం

ఏలూరు సిటీ, మార్చి 22(ఆంధ్రజ్యోతి) : భూగర్భ జల సంపద పెంచడానికి ఉపాధి హామీ పథకంలో పలు కార్యక్రమాలను నిర్వ హిస్తున్నారు. ఈ పథకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయడంతో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పలు కార్యక్రమాలను డ్వామా నిర్వహిస్తోంది. జిల్లాలో పండ్లతోటల పెంపకం, పాడి పశువులు ఉన్న రైతులకు పశుగ్రాసం (గడ్డి) పెంపకం కార్యక్రమాలను రాబోయే జూన్‌ నుంచి అమలు చేయడానికి డ్వామా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలలోనే ఈ పథకాలకు సంబంధించి రైతులను గుర్తిస్తారు. ప్రస్తుతం జిల్లాలో జల సంరక్షణలో భాగంగా మెట్ట గ్రామాల్లోని పండ్లతోటల్లో ప్రతి చెట్టు చుట్టూ పళ్లాలను (పంట కుంటలు) ఏర్పాటు చేస్తున్నారు. మెట్టలోని జంగారెడ్డిగూడెం, నూజివీడు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యల గూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, ఆగిరిపల్లి, లింగపాలెం, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, కామవరపుకోట, టి.నరసాపురం, దెందులూరు, పెదవేగి, ద్వార కాతిరుమల మొత్తం 18 మండలాల్లో ఈ కార్య క్రమాన్ని రూ.32.50 కోట్లు ఉపాధి నిధులతో నిర్వహిస్తున్నారు. వీటితో పాటు భీమడోలు మండలంలోని రెండు పంచాయతీల్లో ఈ పనులు నిర్వహించాలని నిర్ణయించారు. ఎకరా నికి సుమారు రూ.లక్ష ఖర్చు అవుతుంది. ఆ నిధులను ఉపాధి పథకంలో కేటాయిస్తున్నారు. జిల్లాలో పంట కుంటలను ఐదువేలు వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 2,374 పనులకు అనుమతులు ఇచ్చారు.

ఫ పండ్ల తోటల్లో పంట పొలం చుట్టూ సరిహద్దు కందకాలు ఏర్పాటుకు రూ. 27.86 కోట్లు కేటాయించారు. ఎకరానికి రూ.90 వేలు ఉపాధి నిధులను కేటాయిస్తారు. పంటచేలల్లో పడిన వర్షపునీరు బయటకు పోకుండా ఆ పొలంలోనే ఇంకేలా ఈ సరిహద్దు కందకాలు దోహదపడతాయి. పంట కుంటల పథకానికి ఇప్పటికే జిల్లాలోని 2,786 ఎకరాలకు సంబం ధించి రైతులు ముందుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

పండ్ల తోటలలో నిర్వహిస్తున్న జల సంరక్షణ కార్యక్రమాలతో జిల్లాలో భూగర్భ జల సంపద పెరగనుంది. వర్షపునీటిని సంరక్షించుకోవడానికి ఈ జల సంరక్షణ పనులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమాలను జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించాం. జిల్లాలో పంట కుంటలు, కందకాలు ఏర్పాటు కు రూ.60.36 కోట్లు కేటాయించారు. వర్షపునీటిని ఒడిసి పట్టటం వల్ల బోర్లలో నీటి నిల్వలు పెరుగుతాయి. పంట దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. విద్యుత్‌ ఆదా అవుతుంది. రైతుల్లో అవగాహన పెరిగితే మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తాం.

– కె.వెంకట సుబ్బారావు, డ్వామా పీడీ

Updated Date - Mar 23 , 2025 | 12:51 AM