Vallabhaneni Vamsi: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
ABN , Publish Date - Feb 25 , 2025 | 08:55 PM
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటి కోర్టు మరోసారి రిమాండ్ పొడిగింది. అలాగే సత్యవర్థన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీని పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా సత్యవర్థన్ స్టేట్ మెంట్ రికార్డును ఎదురుగా ఉంచి వంశీని పోలీసులు ప్రశ్నించారని సమాచారం.

విజయవాడ, ఫిబ్రవరి 25: టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన వల్లభనేని వంశీ రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. వంశీని మరో 14 రోజు పాటు...అంటే మార్చి 11వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. గతంలో విధించిన రిమాండ్ గడువు నేటితో అంటే మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని జైలు నుంచి వంశీని వర్చువల్‌గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. దీంతో వంశీకి 14 రోజులు రిమాండ్‌ను న్యాయమూర్తి విధించారు.
మరోవైపు సత్యవర్థన్‌ను అపహరించిన కేసులో వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు తొలి రోజు.. రెండున్నర గంటలపాటు విచారించినట్లు సమాచారం. కిడ్నాప్ కేసులో పలు ఆధారాలను ఈ సందర్భంగా వంశీ ముందు పోలీసులు ఉంచి.. ఆ క్రమంలో 20కి పైగా ప్రశ్నలు వంశీకి పోలీసులు సంధించినట్టు తెలుస్తోంది. పలు కీలక ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదంటూ వంశీ.. వాటిని దాట వేసినట్లు ఓ ప్రచారం సాగుతోంది. అయితే సత్యవర్థన్ స్టేట్‌మెంట్ ఆధారంగా వంశీని పలువురు పోలీస్ ఉన్నతాధికారులు విచారించినట్లు సమాచారం.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: అంజన్న వ్యాఖ్యలపై స్పందించిన జగ్గారెడ్డి
Also Read: జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు