Share News

భక్తి శ్రద్ధలతో రంజాన్‌

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:27 AM

నగరంలోని ముస్లిం సోదరులు సోమవారం రంజాన్‌ (ఈదుల్‌ ఫిత్ర్‌) పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.

భక్తి శ్రద్ధలతో రంజాన్‌

విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని ముస్లిం సోదరులు సోమవారం రంజాన్‌ (ఈదుల్‌ ఫిత్ర్‌) పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. కోటవీధి, చెంగలరావుపేట, జగదాంబ జంక్షన్‌, చినవాల్తేరు, అక్కయ్యపాలెం, అల్లిపురం, ముస్లిం తాటిచెట్లపాలెం, న్యూకాలనీ, మర్రిపాలెం, గోపాలపట్నం, గాజువాక, పెందుర్తి, ఎంవీపీ కాలనీ, మధురవాడ ప్రాంతాల్లోని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. మసీదు ఇమామ్‌లు రంజాన్‌ సందేశాన్ని వినిపించారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సాగర్‌నగర్‌లో షమీ ప్రార్థన

సాగర్‌నగర్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): భారత క్రికెటర్‌ మహ్మద్‌ షమీ రంజాన్‌ను పురస్కరించుకుని సోమవారం సాగర్‌నగర్‌ సమీపంలోని తాటిచెట్లపాలెం మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సభ్యుడిగా ఉన్న షమీ...ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ ఆడాడు. మ్యాచ్‌ అనంతరం హోటల్‌లో బస చేసిన షమీ సోమవారం రంజాన్‌ కావడంతో సమీపంలో ఉన్న మసీదులో ప్రార్థన చేయడానికి విచ్చేశారు.

Updated Date - Apr 01 , 2025 | 01:27 AM