Share News

8 నుంచి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె?

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:17 AM

విశాఖ స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు నిరసనగా ఈ నెల 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు తెలిసింది. యాజమాన్యం ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా మంగళవారం 1,503 మందిని తొలగించిన నేపథ్యంలో బుధవారం ప్లాంటులో అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు సమావేశమయ్యారు.

8 నుంచి   కాంట్రాక్టు కార్మికుల  నిరవధిక సమ్మె?

ఉక్కుటౌన్‌షిప్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):

విశాఖ స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు నిరసనగా ఈ నెల 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు తెలిసింది. యాజమాన్యం ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా మంగళవారం 1,503 మందిని తొలగించిన నేపథ్యంలో బుధవారం ప్లాంటులో అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు సమావేశమయ్యారు. యాజమాన్యం నిర్ణయంపై ఆందోళనకు సిద్ధం కావాలని నిర్ణయించారు. అయితే మరోసారి శుక్రవారం సాయంత్రం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని కార్మిక నాయకులు తెలిపారు. అయితే ఎక్కువ మంది నాయకులు నిరవధిక సమ్మెకు వెళ్లాలని సమావేశంలో ప్రతిపాదించినట్టు తెలిసింది.

Updated Date - Apr 03 , 2025 | 01:17 AM