Share News

రంజాన్‌ ఉపవాస ప్రక్రియతో ఆధ్యాత్మిక క్రమశిక్షణ

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:38 PM

రంజాన్‌ సందర్భంగా ముస్లింలు ఆచరించే ఉపవాస ప్రక్రియతో ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు.

రంజాన్‌ ఉపవాస ప్రక్రియతో ఆధ్యాత్మిక క్రమశిక్షణ
ప్రార్థనల్లో పాల్గొన్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

ఇఫ్తార్‌ విందులో కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

పాడేరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ సందర్భంగా ముస్లింలు ఆచరించే ఉపవాస ప్రక్రియతో ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. ఇక్కడ శనివారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇస్తామిక్‌ క్యాలెండర్‌ ఆధారంగా తొమ్మిదో నెలలో రంజాన్‌ పండుగ పురస్కరించుకుని ఉపవాస ప్రక్రియను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. ఉపవాస ప్రక్రియ విరమణ అనంతరం చేసే పండుగ భోజనాన్ని ఇఫ్తార్‌గా పేర్కొంటారన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక చర్యలతో క్రమశిక్షణతోపాటు మానసిక, శారీరక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. అనంతరం పలువురు ముస్లింలకు ఇఫ్తార్‌ విందును కలెక్టర్‌ వడ్డించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, మైక్రో ఇరిగేషన్‌ పీడీ రహీమ్‌, వైజాగ్‌ మైనార్టీ కార్పొరేషన్‌ ఏడీ శర్మ, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌, స్థానిక ముస్లిం మత పెద్దలు యాసిన్‌, హైదర్‌, అలీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:38 PM