Share News

మాడుగులలో భారీ గిరినాగులు

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:23 AM

కేంద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం రెండు భారీ గిరి నాగు (కింగ్‌ కోబ్రా)లు హల్‌చల్‌ చేశాయి. మాడుగుల శివారులోని గదబూరులో చిన్ని అచ్చిబాబు తన ఇంటి పరిసరాల్లో ఉన్న తుప్పలను తొలగిస్తుండగా అప్పటికే అక్కడ వున్న గిరి నాగు బుసులు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో స్థానిక స్నేక్‌ క్యాచర్‌ పెచ్చేటి వెంకటేశ్‌కి సమాచారం ఇచ్చారు. అతను వచ్చి సుమారు 15 అడుగుల పొడవు వున్న గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నాడు. కొద్దిసేపటి తరువాత మోదమాంబ కాలనీ శివారు ఎలుబండి కనక కల్లాల వద్ద గిరినాగు కనిపించింది. సమాచారం అందుకున్న వెంకటేశ్‌ వచ్చి పట్టుకున్నాడు. ఇది కూడా ఇంచుమించు 15 అడుగుల పొడవు వుంది. అనంతరం రెండు గిరి నాగులను సమీపంలోని అడవిలో విడిచిపెట్టాడు.

మాడుగులలో భారీ గిరినాగులు
మాడుగుల మోదమాంబ కాలనీలో గిరినాగును పట్టుకుంటున్న వెంకటేశ్‌

వేర్వేరుచోట్ల రెండు కింగ్‌కోబ్రాలు పట్టివేత

అడవిలో విడిచిపెట్టిన స్నేక్‌ క్యాచర్‌ వెంకటేశ్‌

మాడుగుల, మార్చి 19: కేంద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం రెండు భారీ గిరి నాగు (కింగ్‌ కోబ్రా)లు హల్‌చల్‌ చేశాయి. మాడుగుల శివారులోని గదబూరులో చిన్ని అచ్చిబాబు తన ఇంటి పరిసరాల్లో ఉన్న తుప్పలను తొలగిస్తుండగా అప్పటికే అక్కడ వున్న గిరి నాగు బుసులు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో స్థానిక స్నేక్‌ క్యాచర్‌ పెచ్చేటి వెంకటేశ్‌కి సమాచారం ఇచ్చారు. అతను వచ్చి సుమారు 15 అడుగుల పొడవు వున్న గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నాడు. కొద్దిసేపటి తరువాత మోదమాంబ కాలనీ శివారు ఎలుబండి కనక కల్లాల వద్ద గిరినాగు కనిపించింది. సమాచారం అందుకున్న వెంకటేశ్‌ వచ్చి పట్టుకున్నాడు. ఇది కూడా ఇంచుమించు 15 అడుగుల పొడవు వుంది. అనంతరం రెండు గిరి నాగులను సమీపంలోని అడవిలో విడిచిపెట్టాడు.

Updated Date - Mar 20 , 2025 | 01:23 AM