సందడిగా రంజాన్
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:55 PM
happy ramzan ఈద్-ఉల్ ఫితర్‌గా పిలుచుకునే రంజాన్ పండుగను ముస్లింలు ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కొత్తవస్త్రాలు ధరించి ఈద్‌ముబారక్ చెప్పుకున్నారు.

సందడిగా రంజాన్
ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లింలు
విజయనగరం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఈద్-ఉల్ ఫితర్‌గా పిలుచుకునే రంజాన్ పండుగను ముస్లింలు ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కొత్తవస్త్రాలు ధరించి ఈద్‌ముబారక్ చెప్పుకున్నారు. ఈద్గాల వద్ద సోమవారం సందడి వాతావరణం కనిపించింది. నెల రోజుల పాటు కఠిక ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు ఈద్గాలు, మసీదుల్లో ప్రతిరోజూ సామూహిక ప్రార్థనలు చేశాక ఇఫ్తార్ స్వీకరించేవారు. రంజాన్ పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జామియా మసీద్, బాబామెట్ట దర్గా, మోమాన్‌మసీద్, చోటీ మసీద్ తదితర చోట్ల ముస్లింలు అత్యధికంగా ప్రార్థనలు నిర్వహించారు. ఎంపీ కలిశెట్టి ఆప్పలనాయుడు జిల్లా కేంద్రంలోని మసీదులో సామూహిక ప్రార్థనల్లో పాల్లొన్నారు.