Share News

Medical Stores మందుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:45 PM

Surprise Inspections at Medical Stores ఆపరేషన్‌ గరుడలో భాగంగా జిల్లాలోని మెడికల్‌ షాపులపై అధికారులు నిఘా పెట్టారు. శుక్రవారం 4 మందుల షాపులపై దాడులు చేశారు.

  Medical Stores మందుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు
పార్వతీపురంలోని ఓ మెడికల్‌ షాపులో తనిఖీలు చేస్తున్న అధికారులు

పార్వతీపురం/పార్వతీపురం టౌన్‌/పాలకొండ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ గరుడలో భాగంగా జిల్లాలోని మెడికల్‌ షాపులపై అధికారులు నిఘా పెట్టారు. శుక్రవారం 4 మందుల షాపులపై దాడులు చేశారు. పార్వతీపురంలోని మడుఉ హోల్‌సేల్‌ మెడికల్‌ షాపుల్లో విజిలెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, లోకల్‌ పోలీసులతో పాటు డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో ఓ మెడికల్‌ షాపు.. వైద్యుల ప్రిస్కిప్షన్‌ , బిల్లులు ఇవ్వకుండా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం పాలకొండలో ఓ మందుల దుకాణాన్ని తనిఖీ చేశారు. మత్తు మందులు, కాలం చెల్లినవి ఏమైనా ఉన్నాయా? అని పరిశీలించారు. బిల్లులు, స్టాక్‌ వివరాలను సరి చూశారు. మరో రెండు రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగుతాయని డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆశ తెలిపారు. 32 నిషేధిత మందులను ఎవరూ విక్రయించరాదనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా మందుల షాపుల్లో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Mar 21 , 2025 | 11:45 PM