సీసీరోడ్లకు భారీగా నిధులు:కలెక్టర్
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:10 AM
జిల్లాలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఉపాధి హామీ కన్వర్జెన్స్ కిందరూ.400 కోట్ల విలువైన పనులు మంజూరు చేసినట్టు కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. ఇప్పటి వరకూ సుమారు రూ.150 కోట్ల మేర పనులు పూర్తయ్యాయని.... ప్రగతిలో ఉన్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పారు. మిగిలిన రూ.250 కోట్ల పనులను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

విజయనగరం కలెక్టరేట్, మార్చి 22 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఉపాధి హామీ కన్వర్జెన్స్ కిందరూ.400 కోట్ల విలువైన పనులు మంజూరు చేసినట్టు కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. ఇప్పటి వరకూ సుమారు రూ.150 కోట్ల మేర పనులు పూర్తయ్యాయని.... ప్రగతిలో ఉన్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పారు. మిగిలిన రూ.250 కోట్ల పనులను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. శనివారం సా యంత్రం కలెక్టర్ తన చాంబర్ నుంచి మండ ల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో ఫామ్ పాండ్స్ తవ్వడానికి శనివారం పనులు ప్రారంభించినట్లు చెప్పారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నా రు. జిల్లాలో జూన్ నాటికి సుమారు 11,522 ఫామ్ పాండ్స్ నిర్మాణం లక్ష్యం కాగా... ఈనెలా ఖరు లోగా 3,200 పూర్తి చేయాలన్నారు. ఉపా ధి హామీ వేతనదారులకు కనీస వేతనం రూ.300 వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. ఉపాధిలో అవినీతి, అక్రమాలను సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కడ లోటు పాట్లు జరిగినా ఎంపీడీవోలదే బాధ్యత అని పేర్కొన్నారు. ఎంపీడీవోలు విస్తృతంగా పర్య టించి క్షేత్రసాయిలో పనులను పర్య వేక్షించాలని ఆదేశించారు.
ప్రత్యేక బృందాలతో తనిఖీ..
త్వరలో జిల్లా అధికారుల నేతృత్వంలో రెవె న్యూ, పోలీసు అధికారులతో ప్రత్యేక బృందా లను నియమించి, క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేయిస్తామని... అక్ర మాలు జరిగితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే పనస కలప కొరత ఉందని, దీనిని నివారించేందుకు విస్తృతంగా పనస చెట్లను పెంచాలన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వ హించే అక్షరాస్యత పరీక్షను పర్యవేక్షించాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షకు సుమారు 48,578 మంది హాజరు కానున్నారు.
పీఎం ఇంటర్న్‌షిప్‌కు
దరఖాస్తు చేసుకోండి..
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్ కోరారు. దీనికి సంబందించి విస్తృత ప్రచారం నిర్వ హించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం జరిగింది. ఈ సమా వేశంలో కలెక్టర్ మాట్లాడారు. పది... ఆపై తర గతులు ఉత్తీర్ఱత అయిన వారంతా ఈ శిక్ష ణకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఏడా ది పాటు ఉండే ఈ శిక్షణ కాలంలో నెలకు రూ.6000 చొప్పున స్టయిపండ్‌ను అందజేస్తా రని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, సీపీవో బాలాజీ, మెప్మా పీడీ చిట్టిరాజు, జిల్లా నైపుణ్య అధికారి ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ..
ఈ నెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా శనివారం తన చాంబర్‌లో దీనికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెద్యాధికారి జీవ.నరాణి, టీబీ అధికారి రాణి పాల్గొన్నారు.