భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:07 AM
భూగర్భ జలాలు పెంపే లక్ష్యంగా ఇంకుడు గుంతల నిర్మాణాలను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ఇంకుడు గుంతల తవ్వకాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు.

ఫవిజయనగరం రూరల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని 240 ఇంకుడు గుంతలు తవ్వడం లక్ష్యంగా నిర్ణయించినట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. మండలంలోని రీమాపేటలో ఇంకుడుగుంతల తవ్వకం పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంటా వెంకటరావు పాల్గొన్నారు. అలాగే ద్వారపూడిలో ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని పారంభించారు.
ఫచీపురుపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలను పెం చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. శనివారం కర్లాంలో ఫాంపాండ్ల తవ్వ కాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దన్నాన రామచంద్రుడు, మహంతి అప్పలనాయుడు, కెల్ల రామారావు, బాణాన రామకృష్ణంనాయుడు, దుగ్గు మల్లేశ్వరరావు, గంట్యాడ సత్యనా రాయణ, గడే సన్యాసప్పలనాయుడు, ఎంపీడీవో ఐ. సురేష్, ఏపీఓ ఆదిబాబు పాల్గొన్నారు.
ఫలక్కవరపుకోట, మార్చి 22(ఆంధ్రజ్యోతి): నీటి నిల్వలు పెంచి తద్వారా బావితరాలకు మంచినీరు అందించాలని ఎమ్మెల్యే లలితకుమారి తెలిపారు. ఎల్.కోట బంగారు బుల్లోడు వ్యవసాయ భూముల్లో ఫాంపాండ్ల పనులకు శ్రీకారం చుట్టారు.